
తాజా ఆర్పీ చెప్పుకొచ్చిన గత అనుభవాలలో… త్రివిక్రమ్, సునీల్ ల గురించి కీలక విషయాలను వెల్లడించారు. ‘త్రివిక్రమ్ శ్రీనివాస్, సునీల్, నేను రూమ్ మేట్స్ గా ఉన్న సమయంలో పోసాని కృష్ణమురళి దగ్గర త్రివిక్రమ్ అసిస్టెంట్ గా పనిచేసే వారని, దీంతో పాటు ట్యూషన్స్ కూడా చెప్తూ చాలా కష్టపడేవాడని’ త్రివిక్రమ్ తీరు గురించి చెప్పుకొచ్చారు. అయితే ఇదే సమయంలో తమ రూమ్ లో ఉన్న సునీల్ మాత్రం మహా బద్ధకస్తుడని చెప్పి షాక్ ఇచ్చారు.
‘ఏదో విధంగా ఏదొక డైరెక్టర్ అవకాశం ఇస్తాడులే… అన్న విధంగా సునీల్ ఉండేవాడని, ఇప్పుడంటే తెగ కష్టపడుతున్నాడు గానీ, అప్పట్లో లేదని’ చెప్పాడు పట్నాయక్. అయితే సునీల్ మాట్లాడుతుంటే, ఆ టైమింగ్, వెటకారం బహుశా భీమవరం బ్లడ్ లోనే ఉందేమో గానీ, చాలా ఎంటర్టైనింగ్ గా ఉండేదని, ఎవరైనా ఒక్కసారి కలిస్తే అతనితో సినిమా చేయాలనుకునేవారని, అంతగా తన టైమింగ్ తో ఆకట్టుకునేవాడని, సునీల్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఇక, తన విషయమైతే… ‘ఇంటి నుండి డబ్బులు వచ్చేవని, తండ్రి మీద ఆధారపడేవాడిని, ఏదైనా పనోస్తే చేసేవాడిని, లేకపోతే లేదు, అలాగే ఖాళీగా ఉండేవాడినని’ ఆనాటి కష్టసుఖాలను ఓ మీడియా ఇంటర్వ్యూలో నెమరువేసుకున్నారు. అంతేకదా… నాటి కష్టాలను తలుచుకుంటూ నేడు ఆనందపడడమే మనిషి జీవితం. కష్టపడి పైకొచ్చిన వారి జీవితంలో ఉండే కిక్కే అది!
The box office results have become very unpredictable. Amid this, the situation of every big…
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…