
వారిలో 38 మంది నుంచి భూములు కొనుగోలు చేసిన ఎంవీవీ సంస్థల అధినేత సత్యనారాయణ ‘విశాఖపట్నం సీటీ’ పేరిట ఓ గృహనిర్మాణ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. వ్యాపార విస్తరణలో భాగంగా భారీ ఎత్తున ప్రకటన బోర్డులు, హోర్డింగులతో ప్రకటనలు గుప్పించారు. దీంతో, ఈ లేఅవుట్ లో ఉన్న ఇతరుల భూముల్ని ఆక్రమించి, లే అవుట్ కు రోడ్డు వేసుకున్నారని వారు మండిపడుతున్నారు. అంతేకాకుండా, వారికి సంబంధించిన భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారని వారు ఆరోపిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన జడ్డు విష్ణుమూర్తి పీఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సీఐ లక్ష్మణమూర్తి ప్రాథమికంగా ఆరోపణలు రుజువు కావడంతో లాసన్స్ బే కాలనీలోని నివాసం ఉంటున్న సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు సమయంలో తనకు గుండె నొప్పిగా ఉందని చెప్పడంతో చికిత్స కోసం కేజీహెచ్ కు తరలించారు. తనపై టీడీపీ నేత కిమిడి కళావెంకట్రావు కుటుంబ సభ్యులు కక్షగట్టారని, వారే తనపై లేనిపోని నిందలు మోపి, తనను అభాసుపాలు చేయాలని చూస్తున్నారని సత్యనారాయణ ఆరోపించారు.
BOTTOM LINE Period Gangster Saga Is All Show, No Substance PLATFORM Netflix RUNTIME 3 Hours(5…
The release date of Ramayana is approaching, and amid that, the movie continues to be…