
నిన్న సాయంత్రం తెలంగాణ ఎగ్జిబిటర్లు అందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కొన్ని తీర్మానాలు వెల్లడించారు. వాటిలో ముఖ్యమైనవి.. ఇకపై తెలంగాణ సింగిల్ స్క్రీన్స్ లో పర్సంటేజ్ షేరింగ్ కి అంగీకరించిన సినిమాలు మాత్రమే ప్రదర్శిస్తామని, నిర్మాతలు ప్రభుత్వాల నుండి జీవోలు తెచ్చుకున్నా.. తమ సింగిల్ స్క్రీన్స్ లో మాత్రం నార్మల్ రేట్స్ కే సినిమాల్ని ప్రదర్శిస్తామని. ఈ రెండు నిర్ణయాలు ఇండస్ట్రీని కుదిపేసేవే. ముఖ్యంగా మరో 10 రోజుల్లో విడుదలకు సిద్ధమైన “పెద్ది” సినిమాని ఈ రచ్చ గట్టిగానే ఎఫెక్ట్ చేయనుంది.
అయితే.. ఈ ఎగ్జిబిటర్ల తిరుగుబాటు టార్గెట్ “పెద్ది” సినిమా కాదని, మైత్రీ మూవీ మేకర్స్ అని అందరికీ తెలిసిన విషయమే. గతంలో శిరీష్ తాను ఇచ్చిన ఏకైక ఇంటర్వ్యూలో మైత్రీ సంస్థను నక్కతో పోల్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయనే స్పెసిఫిక్ గా సింగిల్ స్క్రీన్స్ విషయంలో టికెట్ రేట్లు పెంచేది లేదని స్టేట్మెంట్ ఇవ్వడం అనేది చర్చనీయాశంగా మారింది. ఎందుకంటే.. ఇదే దిల్ రాజు & టీమ్ “బాహుబలి” సినిమాకి టికెట్ కౌంటర్లో కూర్చుని మరీ 100 రూపాయల టికెట్ ను 900/- రూపాయలకి అమ్ముకున్న సందర్భాలు చూసాం. అలాంటిది ఇప్పుడు సడన్ గా టికెట్ హైక్ లు మేం సింగిల్ స్క్రీన్స్ లో అమలు కానివ్వం అని అనడం ఒక రకంగా హాస్యాస్పదమే.
ఇకపోతే.. ప్రస్తుతం ఇండస్ట్రీలో అందరికంటే యాక్టివ్ గా ఉన్న నిర్మాణ సంస్థ మైత్రీ కూడా ఈ విషయంలో తగ్గేది లేదని తెలుస్తోంది. ప్రస్తుతం మైత్రీ సంస్థలో దాదాపు 10 పెద్ద సినిమాలు, 15 దాకా చిన్న సినిమాలు ప్రీప్రొడక్షన్, నిర్మాణ, పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. ప్రస్తుతం ఎగ్జిబిటర్లు అందరూ ప్రతిపాదిస్తున్న షేరింగ్ పద్ధతికి యాంటీగా ఉన్న ఏకైక సంస్థ మైత్రి. ఇండస్ట్రీలోని హీరోల సపోర్ట్ కూడా మైత్రీ వైపే ఉండే అవకాశం ఎక్కువ.
ఏషియన్ సినిమాస్, ఎస్వీసీ, సురేష్ ప్రొడక్షన్స్, గీతా ఆర్ట్స్ వంటి సంస్థలన్నీ ఒకవైపు.. మైత్రీ సంస్థ ఒక్కటే ఒకవైపు నిలబడడంతో ఈ పోటీలో నెగ్గేది ఎవరు అనేది హాట్ డిస్కషన్ టాపిక్ గా మారింది. ఇక్కడ మైత్రీ సంస్థ తగ్గి పర్సంటేజ్ కి ఒకే అంటుందా? లేక బలంగా నిలబడి పర్సంటేజ్ పద్ధతిని పూర్తిగా తుంగలో తొక్కుతుందా? ఈ ఇండస్ట్రీ వర్సెస్ మైత్రీ వార్ లో ఎవరు గెలుస్తారు? అనేది మరికొన్ని రోజుల్లో తెలిసిపోతుంది.
India's 351/7 looked like a strong enough total, but the third ODI against West Indies…
Legendary filmmaker Singeetham Srinivasa Rao has passed away at Kauvery Hospital in Chennai following ill…