
ఈ తరుణంలో ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ఘట్టమనేని కాంపౌండ్ నుండి సుధీర్ బాబు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ప్రేక్షకుల టాక్ పరంగా భిన్న స్పందనలు వ్యక్తమైనప్పటికీ, యూత్ నుండి మంచి స్పందన లభించడంతో, ఓవరాల్ గా బాక్సాఫీస్ వద్ద నిలబడే సినిమాగా నిలుస్తుందన్న నమ్మకాలు ఏర్పడ్డాయి. అయినప్పటికీ ఈ వీకెండ్ గడిస్తే గానీ “సమ్మోహనం” ఫలితం తేలే పరిస్థితి లేదు. గురువారం నాడు రిలీజైన ‘నా నువ్వే’తో పోలిస్తే మాత్రం ‘సమ్మోహనం’ ఓ మెట్టు పైనే ఉంది.
ఏది ఎలా ఉన్నా ప్రస్తుతం ‘సమ్మోహనం’ సినిమాకు వస్తున్న టాక్ సుధీర్ బాబుకు ఖచ్చితంగా ఊరటనిచ్చేదే. గత చిత్రాలతో పోలిస్తే… నటన పరంగా కూడా సుధీర్ బాబుకు మంచి మార్కులు పడ్డాయి, అలాగే టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన అదితి రావుకు, తన డబ్బింగ్ కు కూడా విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఇక నరేష్ క్యారెక్టర్ కు అయితే అన్ని వర్గాల నుండి విశేషమైన ఆదరణ లభిస్తోంది. సాంకేతిక విభాగాల్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పాటలకు అగ్ర తాంబూలం దక్కింది.
Making films rooted in Telangana is not new for Srikanth Odela. Dasara was set in…
రాజకీయంలో ఒక్కోసారి సొంత పార్టీ గెలుపు కన్నా తన ప్రత్యర్థి పార్టీ ఓటమే కీలకంగా మారుతుంది. తమ పార్టీ గెలవకపోయిన…