
రాజీవ్ రవి అందించిన కెమెరా వర్క్ బాగుంది. విశాల్ శేఖర్ సంగీతం ఒక మోస్తరుగా ఉంది. ట్రైలర్ లో వాడిన పింక్ కలర్ టోన్.. అంతగా బాగోలేదు. విలన్ అనూప్ సింగ్ ని ఒక్క షాట్ లో మాత్రమే చూపించారు. చారు హాసన్, అవిటివాడిగా సాయికుమార్ పాత్రలు.. సినిమాకి ఉపయోగపడేవి అయ్యి ఉండవచ్చు. ఈ మధ్య థియేట్రికల్ ట్రైలర్స్ బాగాలేకపోయినా.. సినిమాలు హిట్ అవుతున్నాయి ( ఫిదా, భరత్ అనే నేను). ఈ సినిమా ట్రైలర్ కూడా .. ఫస్ట్ ఇంపాక్ట్ ఇచ్చినంత , కిక్ ఇవ్వలేదు. తెర మీద అల్లు అర్జున్ ఎలా ఆడతాడో? .. పాడతాడో?.. ఎలా అలరిస్తాడో?.. మే 4 వరకు ఆగాల్సిందే. వెల్కమ్ సైనికా… !
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు మెజార్టీ సీట్లు దక్కించుకుంటే వార్త అవుతుంది తప్ప అధికార పార్టీ దక్కించుకుంటే కాదు.…
A Simbu film usually creates enough curiosity, but the latest buzz around his next project…