Telugu

అదే చేస్తే కేంద్రం పోలవరంను ముంచినట్టే

పోలవరం ప్రాజెక్టు కోసం 2017-18 ఆర్థిక సంవత్సరంలో రావాల్సిన రూ.1,400 కోట్లు ఎట్టకేలకు విడుదలయ్యాయి. ఈ మొత్తం శుక్రవారం ప్రాజెక్టు అథారిటీ ఖాతాలో జమయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చి 31లోపే (2017-18 ఆర్థిక సంవత్సరం) 1400 కోట్లు విడుదల కావాల్సి ఉంది. అయితే అనేక వంకలతో వీటిని ఆపుతూ వచ్చారు.

నిధుల సమీకరణ కోసం నాబార్డు చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించి నిధులు ప్రాజెక్టు అథారిటీ ఖాతాకు చేరాయి. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన మరో 766 కోట్ల బిల్లులు ప్రస్తుతం ప్రాజెక్టు అథారిటీ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నిధులన్నీ కేంద్రం పాత డీపీఆర్‌ ప్రకారమే ఇస్తోంది. కొత్త డీపీఆర్‌కు ఆమోదముద్ర వేయలేదు.

ADVERTISEMENT

పాత డీపీఆర్‌ ప్రకారం పోలవరం ప్రాజెక్టు సాగునీటి విభాగం అంచనా వ్యయం 12,294 కోట్లు. రాష్ట్ర విభజనకు ముందే దీనిపై 5,136 కోట్లు వెచ్చించారు. ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వబోమని లోగడే కేంద్రం స్పష్టం చేసింది. అదిపోగా మిగిలిన 7,158 కోట్లు చెల్లించాల్సి ఉంది. అందులో ఇప్పటివరకూ ప్రస్తుత 1,400 కోట్లతో కలిపి 6,764 కోట్లు చెల్లించినట్లయింది. ఇక మిగిలింది 395 కోట్లు మాత్రమే.

ఒకవేళ పోలవరం ప్రాజెక్టు సవరించిన డీపీఆర్‌కు కేంద్రం ఆమోదించకపోతే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నుంచి కేవలం రూ.395 కోట్లు మాత్రమే వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.53వేల కోట్లతో సవరించిన అంచనాలు పంపింది. అందులో సహాయ, పునరావాసానికి రూ.33,225 కోట్లు, సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి రూ.20,509.46 కోట్లు ఖర్చవుతుందని అంచనా

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

మత మార్పిడులను ప్రోత్సహించని మతం హిందూ మతం

భారత్‌లోనే ఒక రాష్ట్రం వాళ్ళు మరో రాష్ట్రంలో ఉద్యోగం, వ్యాపారాల రీత్యా స్థిరపడితే పరాయి దేశస్థుడన్నట్లు చూస్తుంటారు. తమ ఉద్యోగాలు,…

7 minutes ago

సుప్రీంకోర్టుకి కేసీఆర్‌ వెళ్ళాలనుకుంటే రేవంత్ రెడ్డి!

కాళేశ్వరం కేసులో కేసీఆర్‌, హరీష్‌ రావు తప్పకుండా జైలుకి వెళ్తారని సిఎం రేవంత్ రెడ్డి చెప్పి ఇంకా 48 గంటలు…

34 minutes ago