Telugu

బైజూస్ పాయేగా! టోఫెల్ ఆయేగా!

జగన్ తానూ ఎన్నికలలో గెలవడానికి వేసే ఎత్తులతో చిత్తూ చిత్తుగా ఓడిపోయేది, ఓడిపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తే కాదు ఏపీ ప్రజల భవిష్యత్ కూడా అనేది ఇప్పటికైనా ప్రజలు గుర్తిస్తే ఆంధ్రప్రదేశ్ గత చరిత్ర చెప్పుకునే రోజులు భవిష్యత్ లో రాకపోవచ్చు.

ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లీష్ మీడియం అంటూ ముందుకొచ్చిన వైసీపీ ప్రభుత్వం దానికి తగ్గ ఏర్పాట్లలో మాత్రం వెనకడుగులే వేసింది. ముందుగా ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి అందుకు తగ్గ నైపుణ్యాని కల్పించి ఆ తరువాత అమలు చేయవలసిన కార్యక్రమాన్ని ముందుగా ప్రకటనలతో అమలులోకి తెచ్చి ఆచరణలో మాత్రం చేతులెత్తేసింది జగన్ ప్రభుత్వం.

ADVERTISEMENT

ఇంగ్లీష్ మీడియంలో బోధనలు చెప్పే స్థాయికి ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులను సిద్ధం చేయాలి, ఒక్కసారిగా ఇంగ్లీష్ లో బోధన అనే మానసిక ఒత్తిడికి లోనుకాకుండా పిల్లలను, వారి తల్లితండ్రులను కూడా సిద్ధం చేయాలి. అలాగే మాతృ భాషలోనే చదవాలి అనేవారికి తెలుగు భాషను అందుబాటులో ఉంచాలి.ఇదే ప్రభుత్వ విధి.

ఇదే విషయాన్ని ప్రతిపక్షాలు నిలదీస్తే మీకు పేదలంటే ఇంత చులకనా? వారి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం మీకు ఇష్టంలేదా? అంటూ తలా తోక లేని వాదనను తీసుకువచ్చి ఓట్ల రాజకీయానికి తేరలేపారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి అంటూ బైజూస్ కంపెనీతో వేల కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్న వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాకు గుండు కొడుతున్నారు అనేది ప్రజలకు అర్ధం కావాలి.

పేద పిల్లలకు ట్యాబు ల పంపిణి అంటూ ఏడాదికి 500 వందల కోట్లు బైజూస్ కి సమర్పిస్తున్న ప్రభుత్వం కనీసం 15 సంవత్సరాలు లేని పిల్లల చేతిలో ట్యాబు లు పెట్టి చేసింది ఏమిటి పేదల అభివృద్ధా? లేక పిల్లల పతనమా? ఇవేమి కాదు జగన్ ఆలోచనంతా ఓట్ల రాజకీయాల చుట్టే తిరుగుతాయి అని మరోసారి రుజువు చేసుకున్నారు జగన్ అంతే.

ఇప్పుడు మరో కొత్త స్కీమ్ తో పేదల కోసం అంటూ మరొకరి జేబులు నింపడానికి సిద్ధమయ్యారు ముఖ్యమంత్రి జగన్ అంటూ జనసేన నేత నాదెండ్ల ఆధారాలతో వివరించారు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు టోఫెల్ పరీక్షలో శిక్షణ అంటూ ఏడాదికి 1056 కోట్లతో ఈటీఎస్ సంస్థతో జగన్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు ఒక పెద్ద స్కాం అంటూ విమర్శించారు.

ఖాళీగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేవు కానీ ఇటువంటి స్కాం లు చేయడానికి మాత్రం నిధులు ఎక్కడివి అంటూ నాదెండ్ల మనోహర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మూడవరతగతి చదువుతున్న పిల్లలకు ఈ టోఫెల్ శిక్షణ ఉపయోగం ఎంత ఉంటుందో ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించాలి. దీని వలన లబ్ది పొందేది జగన్ మాత్రమే కానీ పేద పిల్లలు కాదనేది గుర్తించాలి.

వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సంస్కరణలు అంటూ ప్రభుత్వ ఖజానాను లూటీ చేస్తుంది. ప్రజలలో చైతన్యం వస్తేనే జగన్ చేసే ఈ దోపిడీని అరికట్టగలం అన్నారు. పేదలని టార్గెట్ చేస్తూ జగన్ చేస్తున్న ఈ ఓట్ల రాజకీయాలలో పేదలు పేదవారిగానే మిగులుతారు అంతేకాదు మరికొంతమంది ఈ పేదవారి జాబితాలో చేరతారు అనేది నమ్మలేని వాస్తవం.

ఇన్ని వేల కోట్ల ప్రజా ధనాన్ని తన రాజకీయ భవిష్యత్ కోసం వెచ్చించే జగన్ వాటిని ఉపయోగించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేస్తే వాటి ఫలితాలను కొన్ని తరాలు అనుభవించవచ్చు.అలాకాకుండా డబ్బులు పంచుతా ఓట్లు సంపాదిస్తా అంటూ ఇదే ధోరణితో ప్రభుత్వం ముందుకెళ్తే ఇలా ఎన్నో కంపెనీలు వస్తుంటాయి వాటి జేబులు నింపుకుంటాయి తిరిగి జెండా పీకేస్తాయి. అంతే కానీ వాటి వలన రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఒరిగేదీమీ ఉండదు సరికదా రాష్ట్ర ఖజానాకు మరో భారం అవుతుంది అంతే!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Ranabaali Review: USA Premiere Report

Ranabaali Review: History Without Heart A film rooted in heart-wrenching stories is let down by…

5 hours ago

Jailer 2 Day 1 BO: Great Start, But Missed Potential?

Rajinikanth's Jailer 2 has taken a strong start at the global box office and is…

8 hours ago