
టిడిపి కూటమి ఎన్నికల హామీలో భాగంగా మహిళలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించే పధకాన్ని దీపావళి నుంచే ప్రారంభించబోతున్నట్లు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం ప్రకటించారు.
ఈ పధకం గురించి చెప్పుకునే ముందు దీనిపై వైసీపి చేసిన దుష్ప్రచారం గురించి రెండు ముక్కలు చెప్పుకోవడం చాలా అవసరం. ప్రభుత్వానికి అసలు ఈ పధకం అమలుచేసే ఉద్దేశ్యమే లేదని మొదట దుష్ప్రచారం చేసింది. దీపావళి నుంచి ఈ పధకం ప్రారంభించబోతున్నట్లు తెలియగానే, మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఇస్తామని టిడిపి హామీ ఇచ్చిందన్న విషయం మరిచి, ముందుగా డబ్బులు కట్టించుకుని జనవరి లేదా ఆ తర్వాత మరెప్పుడో ఇస్తుందట అని దుష్ప్రచారం చేసింది.
కానీ అసలు విషయం ఏమిటంటే, డబ్బు చెల్లించి గ్యాస్ బుక్ చేసుకున్న సిలిండర్ డెలివరీ చేయగానే 48 గంటలలో మళ్ళీ ఆ డబ్బు లబ్ధిదారుల ఖాతాలో జమా అవుతుంది. చేయబోతోంది.
ఇప్పటికిప్పుడు గ్యాస్ సిలిండర్ అవసరం లేనివారు కూడా ఉంటారు. కనుక మొదటి సిలిండర్ మార్చి 31, రెండో సిలిండర్ జూలై 31, మూడో సిలిండర్ నవంబర్ 31లోపుగా బుక్ చేసుకోవచ్చు. మూడు ఉచిత సిలిండర్ల సరఫరాకి ప్రభుత్వంపై రూ. 2,684.75 కోట్లు భారం పడుతుంది. కనుక ఈవిదంగా 12 నెలల్లో మూడు సిలిండర్లు పంపిణీ చేయడం వలన ప్రభుత్వంపై అంత భారం ఒకేసారి పడదు. ఇదీ వాస్తవం.
ఎన్నికల హామీలను ప్రభుత్వం అమలుచేయడంలో ఆలస్యమైతే ఎందుకు అమలుచేయడం లేదు? ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించేది వైసీపియే. హామీలు అమలుచేస్తుంటే వాటిపై ఈవిదంగా ప్రజలను తప్పు దోవ పట్టించేలా దుష్ప్రచారం చేసేదీ వైసీపియే.
ఈ పధకంపై దుష్ప్రచారం చేయబోతే మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటనతో అది కూడా బెడిసికొట్టింది. ఈవిదంగా నీచ రాజకీయాలు చేసినందుకే ప్రజలు తమని తిరస్కరించారని జగన్ ఇప్పటికీ గ్రహించలేదని స్పష్టం అవుతోంది.
ఈ పధకం వివరాలు:
గ్యాస్ కనెక్షన్, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు కలిగి ఉన్నవారందరికీ ఈ పధకం వర్తిస్తుంది. రాష్ట్రంలో మొత్తం 1.47 తెల్ల రేషన్ కార్డులున్నట్లు తెలిపారు. వారందరికీ మూడేసి సిలిండర్లు ఉచితంగా అందిస్తుంది. వీటికోసం ఈ నెల 29 నుంచే బుక్ చేసుకోవచ్చు. వెంటనే వారి ఫోన్‌కి సిలిండర్ బుక్ అయిన్నట్లు మెసేజ్ వస్తుంది.
దీపావళి రోజున సిఎం చంద్రబాబు నాయుడు ఈ పధకాన్ని లాంఛనంగా ప్రారంభించగానే రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లు సరఫరా మొదలవుతుంది. నగరాలు, పట్టణాలలో 24 గంటలలోపు, గ్రామాలలో 48 గంటలలోపు సిలిండర్లు ఇంటికి వస్తాయి.
image.png
Janani Ashok Kumar gives classic polka dots a fresh, flirty update in this outdoor photoshoot.…
Ever since Lyca Productions dropped the official announcement on Indian 3, suggesting that the pending…