క్విడ్ ప్రో కేసులు ఎన్ని ఉన్నా తగ్గేదేలే!

సమైక్య రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఏ పదవీ లేని జగన్మోహన్‌ రెడ్డి ‘క్విడ్ ప్రో’ విధానంలో అక్రమాస్తులు కూడబెట్టినందుకు సీబీఐ జెడి లక్ష్మినారాయణ 11 ఛార్జ్ షీట్లు దాఖలు చేయడం, ఆ తర్వాత కధలు అందరికీ తెలిసినవే. నేటికీ ఆ కేసుల విచారణ అంతూపొంతూ లేకుండా కొనసాగుతూనే ఉంది. వాటి కోసం ఎన్ని వందలు లేదా వేలకోట్ల ప్రజాధనం ప్రభుత్వం ఖర్చు చేస్తోందో ఎవరికీ తెలీదు.

ADVERTISEMENT

ఇకనైనా మళ్ళీ అటువంటి పొరపాటు చేయకుండా వైసీపి ప్రభుత్వం ఉంటుందని భావిస్తే, ఆ కేసుల నుంచి అనేక కొత్త విషయాలు నేర్చుకొని మరింత పకడ్బందీగా, మరింత భారీ స్థాయిలో ‘క్విడ్ ప్రో’కు పాల్పడుతోందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.

వైసీపి ప్రభుత్వం అవినీతిపై అలుపెరుగని పోరాటం చేస్తున్న ఆయన రోజుకో కుంభకోణం బయటపెడతానని చెప్పి మరీ నిన్న విద్యార్దులకు స్కూలు బ్యాగులు, బూట్ల సరఫరాలో ఏవిదంగా అక్రమాలు జరుగుతున్నాయో వివరించారు.

ఇవాళ్ళ ‘క్విడ్ ప్రో’ విధానంలో వైసీపి ప్రభుత్వం ఏ విదంగా వేల ఎకరాలు భూములు తమ బినామీలకు ధారాదత్తం చేస్తోందో వివరించారు. ముఖ్యమంత్రి జగన్‌కు, ఆయనకు అత్యంత సన్నిహితులకు లబ్ధి కలిగేలా ‘న్యూ ఇండస్ట్రియల్ లాండ్ పాలసీ’ని ప్రభుత్వం తీసుకువచ్చిందని నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు.

నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు సమీపంలో ఇండోసోల్ అనే కంపెనీకి ఈ పాలసీ ద్వారా 8,348 ఎకరాలు ధారాదత్తం చేసిందన్నారు. మొదట 5,148 ఎకరాలు తర్వాత కొత్త పాలసీ పేరుతో మరో 3,200 ఎకరాలు ఇచ్చిందని ఆరోపించారు. తొలుత 10 సంవత్సరాల లీజు అని చెప్పిన వైసీపి ప్రభుత్వం తర్వాత దానికి శాస్వితంగా ఆ భూములపై యాజమాన్య హక్కులు కూడా కల్పించిందని నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు.

కేవలం లక్ష రూపాయలు పెట్టుబడితో ఏడాదిన్నర క్రితమే స్థాపించిన ఇండోసోల్ కంపెనీకి జగన్‌ ప్రభుత్వం ఏకంగా రూ.76,000 కోట్ల విలువగల ప్రాజెక్టులు కట్టబెట్టిందని అన్నారు. దాని పట్ల జగన్‌ ప్రభుత్వానికి ఇంత ప్రేమ, నమ్మకం ఎందుకు పుట్టుకొచ్చిందంటే దాని వెనుకున్న షిర్డీ సాయి షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ ముఖ్యమంత్రి సన్నిహితుడైన నర్రా విశ్వేశ్వర్ రెడ్డి కావడమే అని నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు.

ఇండోసోల్ కంపెనీలో 49శాతం షేర్స్ అరబిందో ఫార్మా కొన్న మాట వాస్తవమా కదా?అరబిందో ఫార్మా వైసీపికి చెందిన శరత్ చంద్రారెడ్డిదా కాదా? నెల్లూరులో విలువైన భూములను అస్మదీయులకి పంచిపెట్టేసిందని నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. చెప్పాలని నాదెండ్ల మనోహర్‌ ప్రశ్నించారు.

గతంలో కృష్ణపట్నం పోర్టు నిర్మిస్తున్నప్పుడు దానికి ఒకేసారి ఇంత భూమి కేటాయించలేదని, అది సమర్ధంగా పనిచేయగలదని నిరూపించుకొన్న తర్వాతే దానికి 4,553 ఎకరాలు ఇచ్చిందని అన్నారు. కానీ జగన్‌ ప్రభుత్వం తమ బినామీల కోసం ల్యాండ్ పాలసీ మార్చేసి ఏకంగా 8,348 ఎకరాలు ధారాదత్తం చేసిందన్నారు. ఇది క్విడ్ ప్రో కాదా? అని నాదెండ్ల మనోహర్‌ ప్రశ్నించారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

CJP Protest: Bollywood Star Detained, His Smile Triggers

The protest of the Cockroach Janata Party, also called CJP, against Chief Election Commissioner Gyanesh…

17 minutes ago

విపక్షాల విమర్శలకు వెంకయ్య సూటి ప్రశ్న…

బీజేపీ ఓట్ చోరీ అంటూ, సర్ ప్రక్రియ అప్రజాస్వామ్యం అంటూ ఇటు బీజేపీ పై అటు సీఈసీ జ్ఞానేశ కుమార్…

37 minutes ago