
సరదాగా వంట చేసే తనకు తెలియకుండా ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టేసిందని, తానేమో అందుకు విరుద్ధంగా ఉంటానని, ఇలా అల్లరి పనులు చేసేస్తుంటుందని సమంత గురించి చెప్పుకొచ్చారు. ఇక వంట విషయంలో సమంత జీరో అని, అస్సలు తెలియదని, లైఫ్ ను చాలా జాలీగా, హ్యాపీగా గడపడం తప్ప, వర్రీ, స్ట్రెస్, కుకింగ్ లాంటివి సమంతకు తెలియని విషయాలుగా తన పార్టనర్ గురించి నవ్వుతూ చెప్పారు. మళ్ళీ తామిద్దరం కలిసి ఒక ప్రేమకధలో నటించాలని ఉందని, తప్పకుండా చేస్తామని అభిమానులకు తీపికబురు అందించారు.
‘ఏ మాయచేసావే’ సినిమాలో సమంత తన కంటే రెండేళ్ళు పెద్ది కావచ్చు గానీ, రియల్ లైఫ్ లో మాత్రం తానే పెద్ద వాడినని చిరునవ్వులు చిందిస్తూ తెలిపారు. తానంటే బ్యాక్ గ్రౌండ్ ఉండి ఈ స్థాయిలో ఉన్నాను గానీ, సమంత చాలా కష్టపడి పైకి వచ్చిందని, అందుకే తనంటే చాలా గౌరవభావం ఉంటుందని, అందులోనూ ఇతరులకు సేవ చేయడంలో సమంత ఎప్పుడూ ముందుంటుందని, చిన్న పిల్లల విషయంలో తను చేస్తున్న దానికి చాలా సంతోషంగా ఉందని, వీలైనంత ఎక్కువ సహాయం చేయమని ప్రోత్సహిస్తానని శ్యామ్ ను పూర్తిగా అర్ధం చేసుకున్న వ్యక్తిగా తన భావాలు పంచుకున్నారు ఈ అక్కినేని వారసుడు.
Dia Mirza's latest controversy began with a simple appeal for a pollution-free Diwali. But what…
గతంలో బెంగళూర్ ప్యాలస్ లో, హైద్రాబాద్ లోటస్ పాండ్ లో కూర్చుని కూడా పులివెందుల రాజకీయం నడిపించిన జగన్ ఇప్పుడు…