Telugu

యువసామ్రాట్ బిరుదు ఓకే కానీ చేయాల్సింది చాలా ఉంది

స్టార్ ఫ్యామిలీ లెగసీని మోయడం అంత సులభం కాదు. ఎంట్రీ సులభంగా ఉంటుంది కానీ దాన్ని నిలబెట్టుకోవడం పెద్ద సవాల్. ఏ మాత్రం తేడా వచ్చినా కుటుంబమిచ్చిన నటవారసత్వమే బరువుగా మారిపోతుంది. నాగ చైతన్యకి ఈ తత్వం ఇంకాస్త బలంగా బోధపడినట్టు ఉంది. ఇండస్ట్రీకి వచ్చిన దశాబ్దంన్నర అవుతున్నా ఇంకా టైర్ వన్ లీగ్ లోకి చేరకపోవడం అక్కినేని అభిమానులు లోటుగానే ఫీలవుతున్నారు. అందుకే తమ ఆశలన్నీ తమ్ముడు అఖిల్ పైకి మళ్లించుకుని ఏజెంట్ కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

అలా అని చైతు వెనుకబడ్డాడని కాదు. కథలు దర్శకుల ఎంపికలో చేస్తూ వచ్చిన పొరపాట్లు తగిన మూల్యం చెల్లించేలా చేశాయి. తనకు మాస్ అంతగా సూటవ్వదు. అది నిజం. బంగార్రాజులోనూ నాగార్జున ఉన్నాడు కాబట్టి ఆ కాంబినేషన్ వల్ల అది పాసైపోయింది కానీ ఒకవేళ సోలోగా చేసుంటే ఏమయ్యేదో శైలజారెడ్డి గారి అల్లుడు ఎప్పుడో నిరూపించింది. సో తను ప్రయోగాలు చెయాలి. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మట్ జోలికి వెళ్ళడానికి బాడీ లాంగ్వేజ్ పూర్తిగా సరిపోదు. తన లక్షణాలు, యాక్టింగ్ స్కిల్స్ ఇంకేదో డిమాండ్ చేస్తున్నాయి.

ADVERTISEMENT

ఇప్పుడు వస్తున్న కస్టడీ ప్రమోషన్ కంటెంట్ చూస్తుంటే నాగ చైతన్య సరైన దారిలోనే వెళ్తున్నట్టు అనిపిస్తోంది. నాగార్జున కెరీర్ ప్రారంభంలో శివ ఇండస్ట్రీ హిట్ తర్వాత చాలా ఎక్స్ పరిమెంట్లు చేశారు. జైత్రయాత్ర, నేటి సిద్దార్థ, నిర్ణయం, ప్రేమ యుద్ధం లాంటివన్నీ ఆ టైంలో కాంటెంపరరీగా అనిపించే కథలతో రూపొందినవి. కానీ ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. తిరిగి అల్లరి అల్లుడు, వారసుడు, హలో బ్రదర్ అంటూ మాస్ వైపు టర్నింగ్ తీసుకున్నాక కెరీర్ అమాంతం ఊపందుకుంది. టాప్ 4లో నిలబడిపోయాడు.

చైతన్య వెళ్తోంది ఈ రూటే కానీ తండ్రి లాగా తనకు మళ్ళీ మాస్ వైపు వచ్చేందుకు అవకాశం అంత ఈజీగా ఉండదు. దాని బదులు ఇలాంటి విలక్షణ ప్రయత్నాలే కొనసాగించాలి. ఏజెంట్ తో అఖిల్ ఏ స్థాయి ఫలితం అందుకోబోతున్నాడనే దాని మీద తన ఇమేజ్ ప్లస్ మార్కెట్ ఆధారపడి ఉంటాయి కానీ ముందైతే అన్నయ్య ప్లానింగ్ పర్ఫెక్ట్ గా ఉండటం అవసరం. టైటిల్లో యువసామ్రాట్ అంటూ నాన్న బిరుదుని తగిలించేశారు. ఒక సీన్ లో నాగార్జున రెట్రో లుక్ ని చైతుకి సెట్ చేశారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ మళ్ళీ థాంక్ యులు, లాల్ సింగ్ చద్దాలు రాకుంటే చాలు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Ranabaali Sound Issue: Makers Ask Theatres to Turn It Up

Ranabaali has been facing criticism over its background score since its release. Starring Vijay Deverakonda…

8 minutes ago

స్థానిక పరీక్షలు అందరికీ.. మినహాయింపుల్లేవు గురూ!

స్థానిక సంస్థల ఎన్నికలంటే అధికార, ప్రతిపక్ష పార్టీలకు, పోటీ చేస్తున్న అభ్యర్ధులకే పరిమితం అనుకునే రోజులు కావివి. ఈ చెత్త…

11 minutes ago