
ఈ కార్యక్రమాన్ని తొలుత అక్కినేని నాగార్జునతో ప్రారంభించాలని ఉందన్న అనసూయ ఫస్ట్ డేట్ కు అఖిల్ లభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి వచ్చిన స్పందనతో అనసూయ డేట్ రెండవ సెలబ్రిటీ ఎవరన్న ఆసక్తి బుల్లితెర ప్రేక్షకులలో వ్యక్తమవుతోంది. దీనిని మరింత రసకందాయంలో పడేసేలా ఓ ఫోటోను పోస్ట్ చేసి, ఎవరో కనుక్కోండి..? అంటూ ఓ పజిల్ విసిరింది.
అనసూయకు ఎదురుగా కూర్చున్న వ్యక్తి మరెవరో కాదు, నాగ్ తనయుడు, అఖిల్ సోదరుడు నాగచైతన్య అని నెటిజన్లు స్పష్టం చేసారు. ఒకవేళ ఆ సెలబ్రిటీ నాగచైతన్య అయితే… అనసూయ వేసే ప్రశ్నలలో ఖచ్చితంగా ‘కృష్’ అన్న ప్రశ్న ఉంటుంది. మరి దానికి చైతూ సమాధానం ఏమి ఉంటుంది? లేక డైరెక్ట్ గానే సమంత విషయం అడిగితే, దానికి నాగచైతన్య ఎలా స్పందిస్తారు? అనే ఉత్సుకత అభిమాన వర్గాల్లో కలుగుతోంది.
Nani has big plans for The Paradise. The film is not being treated as just…
సినిమాలలో కొన్ని కథలు, ఫార్ములాలు, కాంబినేషన్‌లు సక్సస్ కావచ్చు. కానీ కొత్త ఆలోచనలు, ప్రయోగాలు చేయకుండా వాటినే పట్టుకొని వ్రేలాడుతుంటే…