
పెళ్లి కబురు పక్కనపెట్టి, తమ రిసెప్షన్ సంగతులను చెప్పుకొచ్చింది. తాము పెళ్లి ఎక్కడ చేసుకున్నా, రిసెప్షన్ మాత్రం ఇదే రెస్టారెంట్ లో చేసుకుంటామని సమంత ధృవీకరించింది. ఇంతకీ ఆ రెస్టారెంట్ ఏంటిది అనుకుంటున్నారా… నితిన్ – నీరజ కోనలు కలిసి సమంత చేతుల మీదుగా ప్రారంభించిన ‘టీ గ్రిల్స్’ రెస్టారెంట్. ఇక్కడ ఫుడ్ చాలా బాగుందని తమ రిసెప్షన్ ఇక్కడే జరుగుతుందని, శుక్రవారం నాడు జరిగిన ప్రారంభోత్సవం సందర్భంగా సమంత చెప్పుకొచ్చింది.
ఈ రిసెప్షన్ వెన్యూ ఫిక్స్ అయినా, డేట్ మాత్రం ఫిక్స్ కాలేదు. ఆ తేదీని ఎప్పుడు వెల్లడిస్తుందో గానీ, ఇటీవల పబ్లిక్ ప్లేస్ లలో ఈ ఇద్దరూ హల్చల్ చేయడం తగ్గించారు. అంతా అధికారికం అయిపోవడంతో పెద్దగా కిక్ ఉండదని భావించారో ఏమో గానీ, చైతూ – సమంతల సోషల్ మీడియా హంగామాకు కొద్ది రోజులుగా బ్రేక్ పడింది. అక్కినేని వారి ఇంట పెద్ద కోడలు అయినప్పటికీ, లేటుగా ఆ ఇంట అడుగుపెట్టనుంది సమంత.
BOTTOM LINE Painfully Boring RATING 1.75/5 Story, Screenplay, Director: Nishanth Doti Cast: Shiva Kumar Kasaram,…
Nora Fatehi turns a hotel-room backdrop into her own fashion runway, bringing fearless glamour to…