
నాగార్జున తన వైపు నుండి పూర్తి స్పష్టత ఇచ్చేయగా, చైతూ కూడా ఈ ఏడాది కాదు, వచ్చే ఏడాదిలో వివాహం అంటూ ప్రకటన ఇచ్చేసారు. ఇక ఇప్పటివరకు నెటిజన్లతో ఆడుకున్న సమంత వైపే అందరి చూపులు ఉన్నాయి. ‘ప్రేమమ్’ వేడుకకు సమంత విచ్చేస్తుందా? ఒకవేళ వస్తే ఎలాంటి ప్రకటన చేస్తుంది? కేవలం సినిమా గురించే చెప్తుందా? లేక అభిమానులను ఉత్సాహపరిచే విధంగా చెలరేగిపోతుందా? అన్నది వేచిచూడాలి.
వీటన్నింటికి బలాన్నిస్తోంది అక్కినేని నాగేశ్వరరావు జన్మదినం. ఒక మంచి ముహూర్తాన్ని చూసి తానే అధికారిక ప్రకటన చేస్తానని చెప్పిన నాగార్జునకు తన తండ్రి ఏఎన్నార్ పుట్టినరోజును మించిన మంచి ముహూర్తం ఉంటుందా? దీంతో ‘ప్రేమమ్’ వేడుక ఖచ్చితంగా నాగచైతన్య, అఖిల్ ల వివాహ ప్రకటనలకు వేదిక అవుతుందన్న టాక్ హల్చల్ చేస్తోంది.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…