
ప్రీ రిలీజ్ ఈవెంట్ కదా… చిరంజీవి అంతటి వ్యక్తి వస్తే ప్రశంసించడం సహజమే కదా… అందులో భాగంగా ఉద్వేగపూరితంగా ఆ వ్యాఖ్యలు చేసారని భావించినా… ఈ మెగా భజనకు శుభంకార్డు పడేలా లేదు. ఎందుకంటే… ఏకంగా తన సినిమా టైటిల్ “ఛలో” అన్నది రామ్ చరణ్ సినిమా నుండి పెట్టిందని తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలలో చెప్పుకొచ్చారు. చెర్రీ ‘బ్రూస్ లీ’ సినిమాలో ‘లే ఛలో’ అనే పాట వింటున్న సమయంలో, తన సినిమాకు “ఛలో” అన్న టైటిల్ పెట్టాలని భావించానని, ఇదే విషయం దర్శకుడు వెంకీ కుడుములకు చెప్పగా, బాగుందని అన్నారని, అందుకే ఈ టైటిల్ పెట్టినట్లుగా చెప్పుకొచ్చారు.
నాగశౌర్య చెప్పిన విషయాలు నిజంగా వాస్తవమై ఉండొచ్చు. కానీ మొన్నటివరకు జూనియర్ ఎన్టీఆర్ అన్న వ్యక్తి, ప్రస్తుతం మెగా వర్గం వైపుకు ఎందుకు మలుపు తిరిగారు? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే… దీనికి అసలు బ్యాక్ గ్రౌండ్ వేరే ఉంది. నాగబాబు తనయురాలు నిహారికతో నాగశౌర్య వివాహం ఖరారైంది. అందుకే మెగా కాంపౌండ్ హీరోగా నాగశౌర్య మారబోతున్నాడు అని సోషల్ మీడియా కోడై కూస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక వార్త కూడా అతి త్వరలోనే వెల్లడి కానుందని టాక్. ఇందులో వాస్తవం ఎంత ఉన్నా… సెలబ్రిటీలపై ఉండే గాసిప్స్ లో ఆ కిక్కే వేరు కదా..!
Telugu horror cinema seems to have lost its ability to scare audiences. Films that once…
NTR is currently focused on his ongoing project Dragon, which marks his collaboration with Prashanth…