
నాగశౌర్య ఒక సోలో హిట్టు కొట్టి దాదాపు 8 ఏళ్లైపోతుంది. “ఛలో” తర్వాత విడుదలైన సినిమాలన్నీ దాదాపుగా ఫ్లాపులే, “ఓ బేబీ” హిట్టైనా అది సమంత ఖాతాలోకి వెళ్లిపోయింది. “వరుడు కావలెను” కాస్త బెటర్ సినిమా అయినప్పటికీ, కమర్షియల్ హిట్ మాత్రం అందుకోలేకపోయింది. ఇక “లక్ష్య, కృష్ణ వ్రిందా విహారి, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి, రంగబలి” లాంటి సినిమాలు వరుస డిజాస్టర్లుగా నిలిచాయి. అందుకే 2023 తర్వాత నాగశౌర్య నటుడిగా గ్యాప్ తీసుకున్నాడు.
సరిగ్గా అదే సమయంలో శౌర్య పెళ్లి కూడా కావడంతో, ఫ్యామిలీ టైమ్ స్పెండ్ చేయడానికి టైమ్ తీసుకున్నాడు అనుకున్నారు కానీ.. సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నాడు అనేది రియలైజ్ అవ్వడానికి ఎక్కువ టైమ్ పట్టలేదు జనాలకి.
మూడేళ్ల తర్వాత శౌర్య నుండి వస్తున్న తాజా చిత్రం “బ్యాడ్ బాయ్ కార్తీక్” విషయంలో చాలా గొడవలు, సర్దుబాట్లు జరిగినట్లుగా తెలుస్తోంది. అందుకే నిన్న విడుదలైన ట్రైలర్ ఈవెంట్ కి తప్ప శౌర్య ఎక్కడా సినిమా విషయంలో పర్సనల్ గా కానీ, సోషల్ మీడియా పరంగా కానీ ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇక నిన్న డైరెక్టర్ కనిపించలేదు. నిర్మాత ఏకంగా స్టేజ్ మీద పబ్లిక్ గా శౌర్యకి సారీ కూడా చెప్పాడు. దాంతో డైరెక్టర్ కి, శౌర్య కి ఎక్కడో చెడింది అనే విషయం స్పష్టమైంది. ట్రైలర్ కూడా ఆశించిన స్థాయిలో లేదు.
గత కొన్నేళ్లుగా తెలుగు, తమిళ భాషల్లో బాగా నలిగిపోయిన ఒక టెంప్లేట్ సినిమా అని అర్థమవుతుంది. ఏప్రిల్ 17న విడుదలవుతున్న ఈ సినిమాతో శౌర్య కమ్ బ్యాక్ ఇవ్వగలడా? అనేది పెద్ద ప్రశ్న. అయినా.. అసలే సరైన యంగ్ హీరో లేక ఇబ్బందిపడుతున్న తెలుగు చిత్రసీమకి శౌర్య లాంటి టాలెంటెడ్ యంగ్ హీరో గ్యాప్ తీసుకోవడం అనేది మైనస్ అనే చెప్పాలి. శౌర్య త్వరగా కోలుకుని మంచి సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించాలి.
India's 351/7 looked like a strong enough total, but the third ODI against West Indies…
Legendary filmmaker Singeetham Srinivasa Rao has passed away at Kauvery Hospital in Chennai following ill…