
అయితే ఇటీవల కాలంలో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారం నుండి సినీ పరిశ్రమలోకి రావడం వలన కొంత శాతం వచ్చి ఉండవచ్చు గానీ, ప్రస్తుతం ఉన్న ఇండస్ట్రీ పెద్దలలో ఎవరూ బ్లాక్ మనీని దాచిన వారు కాదని అంటున్నారు. ఇక్కడితో ఆగని నాగబాబు, టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా బ్లాక్ మనీ లేదంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి చెప్పినట్లుగా తెలిపారు. మోడీ నిర్ణయానికి ‘జై’ కొట్టడం వరకు బాగానే ఉంది గానీ, టాలీవుడ్ లో బ్లాక్ మనీ లేదని నాగబాబు డిక్లేర్ చేయడం ఒక వింతే అంటున్నారు నెటిజన్లు.
అంటే నాగబాబు మాటల ప్రకారం… తెలుగు సినీ సెలబ్రిటీలంతా వారి ఆదాయానికి తగిన విధంగా పన్నులు కట్టేస్తున్నారన్న మాట. భూతల స్వర్గాన్ని తలపించే విధంగా ఉండే సినీ ప్రముఖుల గృహాలన్నీ పక్కా ‘వైట్’ మనీతో కట్టినవేనట. నమ్మకం కుదరడం లేదా? అలా అంటే ఎలా..? ఆడియో వేడుకల మీద, సినీ ఫంక్షన్లలో అభిమానులే మా ప్రాణం… అంటూ సినీ ఫక్కీలో ఎందరో హీరోలు ఉపోద్ఘాతాలు ఇస్తుంటే… వాటిని చూసి చొక్కాలు చించుకుంటూ ‘మా హీరో సూపర్’ అంటూ నమ్మేయడం లేదా..? ఈ బాబు గారి వ్యాఖ్యలు కూడా అంతే నిజం అని నమ్మేయాలి..?!
BOTTOM LINE Tiresome Return to Outdated Cinema RATING 1.5/5 Story, Screenplay, Director: Chandra Mohan Chintada…
Telangana Congress leadership was delivered a significant shock in the form of the departure of…