
అన్నయ్య చిరంజీవి వాల్తేర్ వీరయ్య ఫంక్షన్లో మాట్లాడుతూ, “ఏపీ మంత్రులు సినీ పరిశ్రమ మీద పడి ఏడవడం మాని ఏపీ అభివృద్ధి గురించి, ఏపీలో రోడ్ల గురించి ఆలోచించమని” చాలా సున్నితంగా చెప్పినందుకు మంత్రులందరూ కట్టకట్టుకొని చిరంజీవిని ఉద్దేశ్యించి చాలా అనుచితంగా మాట్లాడుతున్నారు. వారందరికీ నాగబాబు ఈవిదంగా ట్విట్టర్లో గట్టి డోసే ఇచ్చేశారు. అయితే ఇలాంటి డోసులకు భయపడి వెనక్కు తగ్గే రకం కాదు ఏపీ మంత్రులు. అందుకే చిరంజీవి గురించి మంత్రి రోజా కూడా మాట్లాడేశారు.
చిరంజీవి సినిమా వేదికలపై రాజకీయాలు మాట్లాడటం సరికాదని, అయినా ఆయన సలహాలు మాకు అవసరం లేదన్నారు. ఆ సలహాలేవో తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇచ్చుకొని దారిలో పెట్టాలని రోజా సూచించారు. తాము ఎవరు చెప్పినా వినే పరిస్థితులలో లేమన్నారు మంత్రి రోజా.
వైసీపీలో ఇంకా చాలామంది మాట్లాడాల్సి ఉంది. అందరూ రెండు, మూడో రౌండ్స్ కూడా మాట్లాడేసిన తర్వాత చివరిగా సజ్జల రామకృష్ణారెడ్డి ముగింపు ప్రసంగం చేస్తారేమో? ఆ తర్వాత ఏదో ఓ బటన్ నొక్కుడు సభలో సిఎం జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్ర ప్రజలకు ఇంత మంచి ఇంత మేలు చేస్తున్నా… అంటూ తోడేళ్ళ గ్యాంగ్లో చిరంజీవి పేరును కూడా చేర్చేస్తారేమో?
ఇంతకీ నాగబాబు ఏమి ట్వీట్ చేశారో మీరే చూడండి.. “శ్రమని పెట్టుబడిగా పెట్టి, పన్నుని ప్రభుత్వానికి అనాపైసలతో సహా కట్టి, వినోదాన్ని విజ్ఞానాన్ని జనానికి పంచిపెట్టి , 24 క్రాఫ్ట్ లకి అన్నం పెడుతున్న ఏకైన పరిశ్రమ చిత్రపరిశ్రమ.. ఏ పని లేనోడు పిళ్లి తల గొరిగినట్టు నిజం మాట్లడిన వ్యక్తి మీద విషం కక్కుతున్నారు ఆంధ్రా మంత్రులు.
ఆయన ఫోటో కోసం పడిగాపులు కాసినోళ్లు కూడ ఆయన మీద కారు కూతలు కూస్తున్నారు, ఆకాశం మీద ఉమ్మాలని చూస్తే మీ ముఖం మీదే పడుతుంది.. మీ బతుక్కి మీ శాఖ ల మీద అవగాహన ఉండదు,అభివృద్ధి అనేదానికి అర్ధమే తెలియదు బటన్ నొక్కి కోట్లల్లో ముంచి వేల మందికి ఉచితాలు పంచడమే అభివృద్ధి అనుకుంటున్నారా..?
అభివృద్ధి చేయడానికి ఇంకేం మిగిలి లేదనుకుంటున్నార..! మీ ఆలోచనలు ఎంత క్షీణించి పోయాయో అజ్ఞానం తో కూడిన మీ మాటలు వింటే అర్థం అవుతుంది.
మీ ధౌర్భాగ్యపు దుర్మార్గపు పాలనకి END CARD దగ్గర్లోనే ఉంది.. NOTE: కాలం గాలమేస్తే ప్రకృతే శత్రువవుతుంది… ఆరోగ్యాలు జాగ్రత్త.!
Bhuvneshwar Kumar is back in India's T20I squad after nearly four years, with the experienced…
కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల ఆలోచన చేస్తున్నప్పుడే చిన్న శ్రీనుతో సహా పలువురు టీడీపిలో చేరారు. అదేవిధంగా జనసేనలో…