Telugu

ఆ సీనియర్ నేత టీడీపీలోకి తిరిగి వస్తారా? పార్టీ పగ్గాలు ఆయనకేనా?

Nagam Janardhan Reddy Meets Chandrababu Naidu in Hyderabadవారాంతంలో కుటుంబంతో గడపడానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడితో భేటీ అయ్యారు. శనివారం బంజారాహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి వచ్చిన నాగం తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులపై అరగంట పాటు చర్చించినట్లు తెలుగుదేశం పార్టీ వర్గాలు తెలిపాయి.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నాగం క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. గతంలో నాగాం టీడీపీలో చాలా కాలం ఉండి ఆ తరువాత బీజేపీలోకి, అక్కడ నుండి కాంగ్రెస్ లోకి వెళ్లారు. అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ బరిలో ఉండాలని చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నారు. గత ఐదేళ్లుగా పార్టీని నిర్లక్ష్యం చేసిన ఆయన ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండటంతో తెలంగాణ రాజకీయాలపై కూడా దృష్టి పెట్టారు.

ADVERTISEMENT

ఈ క్రమంలో నాగం తిరిగి టీడీపీలోకి వచ్చి, పార్టీ పగ్గాలు చేపడతారా అనే వదంతులు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే తెలంగాణాలో టీడీపీని పునరుద్దరించాలంటే అది అంత తేలికైన విషయం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే టీడీపీ-తెలంగాణ నాయకులు కొత్తకోట దయాకర్‌రెడ్డి, అరవింద్‌గౌడ్‌, ఆంధ్రప్రదేశ్ టీడీపీ నేతలు కోడెల శివప్రసాదరావు, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి కూడా చంద్రబాబును కలిశారు. తాజా రాజకీయాలపై చర్చించారు.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

AI Teaser, Pooja Hegde Bikini Buzz Failed? Trailer Only Hope

Hai Jawani Toh Ishq Hona Hai, starring Varun Dhawan, Pooja Hegde, and Mrunal Thakur, has…

4 minutes ago

The “Anna” Touch: Vijay Revives Political Decorum

CM Vijay is proving that "elevation" isn’t just about winning elections; it’s about how you…

34 minutes ago