Telugu

చైతూ – సమంతల వివాహంపై లేటెస్ట్ అప్ డేట్!

టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా సమంతకున్న సక్సెస్ నిష్పత్తి, ప్రస్తుత తారామణులలో మరో హీరోయిన్ కు లేదని చెప్పడం అతిశయోక్తి కాదు. అలాంటి సమంత త్వరలోనే అక్కినేని వారి కోడలు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటివరకు నెలకొన్న అన్ని సందేహాలు నివృత్తి కాగా, వివాహం కూడా ఈ ఏడాది కాదు, వచ్చే ఏడాది అన్న విషయం ఖరారైంది.

అయితే వివాహ వేదిక విషయంలోనే సమంత ఓ విజ్ఞప్తి చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. తను పుట్టిపెరిగిన చెన్నైలోనే వివాహం జరిగేలా చూడాలంటూ అక్కినేని కుటుంబానికి ఈ ‘కుందనపు బొమ్మ’ కోరగా, దానికి నాగ్ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని తెలుస్తోంది. సమంత ఆకాంక్షకు అనుగుణంగానే చెన్నైలో వివాహం జరిపించి, హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా రిసెప్షన్ చేయాలనే ఒక అవగాహనకు ఇరు కుటుంబాలు వచ్చినట్లుగా తెలుస్తోంది.

ADVERTISEMENT

‘జనతా గ్యారేజ్’ తర్వాత టాలీవుడ్ లో వస్తున్న ఆఫర్లన్నీ సమంత పక్కన పెట్టడమనేది, పరిణయానికి సిద్ధం కావడమేనని, ప్రస్తుతం చేతిలో ఉన్న ఇతర భాషా చిత్రాలు ముగిసిన వెంటనే వివాహం ఉండవచ్చని సినీ వర్గాల సమాచారం. కాగా, ఈ రిలేషన్ షిప్ పై ఒక్క నాగచైతన్య మినహా అందరూ ఏదొక సందర్భంలో ఏదొక విషయం మీడియాకు తెలిపినవారే. మరి పెళ్ళికొడుకు నుండి ఎప్పుడు అధికారిక వార్త వెలువడుతుందో చూడాలి..!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Mirzapur: The Movie Review: Lengthy But Decent Nostalgia Watch

BOTTOM LINE Lengthy But Decent Nostalgia Watch RATING 2.5/5 Story, Screenplay, Director: Gurmmeet Singh Cast:…

17 minutes ago

‘90స్’ దర్శకుడేనా?.. ‘ఎపిక్’లో ఈ డైలాగులేంటి?

90స్: ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ లాంటి గుర్తుండిపోయే, సున్నితమైన వెబ్ సిరీస్ తీసిన ఆదిత్య హాసన్ నుంచి సినిమా…

22 minutes ago