
“బాహుబలి ది కన్ క్లూజన్” సినిమా సన్నివేశాలతో పాటు ‘కింగ్’ నాగార్జున ప్రధాన పాత్రలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న “ఓం నమో వేంకటేశాయ” సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు కూడా ఉన్నాయని విజయవాడ ఏసీపీలు సత్యానందం, మురళీధర్ లు ఓ అవాక్కయ్యే విషయాన్ని తెలిపారు. అయితే ఈ సినిమా యూనిట్ ఊరట చెందే అసలు విషయం ఏమిటంటే… ఇప్పటివరకు ఈ సన్నివేశాలను ఎవరికీ షేర్ చేయలేదని పోలీసులు ధృవీకరించారు.
అయితే ‘ఓం నమో వేంకటేశాయ’ సీన్లు వీరి దగ్గరికి ఎలా వచ్చాయి? అనే విషయం తేలాల్సి ఉందని, బహుశా అన్నపూర్ణ స్టూడియోస్ నుండి ఈ లీక్ జరిగి ఉంటుందన్న భావనను వ్యక్తపరిచారు. ‘బాహుబలి’ ఎడిటింగ్ వర్క్ లు కూడా అన్నపూర్ణ స్టూడియోలోనే జరుగుతుండడంతో, అక్కడ నుండే ‘ఓం నమో వేంకటేశాయ’ కూడా లీక్ అయ్యిందేమోనన్న అనుమానాలు బలపడుతున్నాయి. ‘బాహుబలి’ విషయంలో అరెస్ట్ చేయబడ్డ కృష్ణచైతన్య మరియు మరో ఆరుగురు విధ్యార్ధులను విచారించిన సందర్భంలో వెలుగులోకి వచ్చిన విషయం ఇది.
చిత్రం: రంభ ఊర్వశి మేనక M9 రేటింగ్: 1.5/5 విడుదల తేదీ: సెప్టెంబర్ 04, 2026 తారాగణం: అల్లరి నరేష్,…
Megastar Chiranjeevi’s Vishwambhara is making steady progress on the post-production front, with music director Gaur…