
వివరాల్లోకి వెళ్తే రేవంత్ రెడ్డి పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరడంతో పార్టీ కార్యకలాపాలపై కీలక నేతలతో ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశం కంటే ముందే గవర్నర్ నరసింహన్ పిలుపు మేరకు రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ ముందు వరుసలో కూర్చుని ఉండగా.. వాళ్ల వెనుకే తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కూర్చున్నారు. అయితే ఈ సందర్భంగా రమణతో చంద్రబాబు చర్చిస్తుండగా వెనకే ఉన్న హోంమంత్రి నాయిని వారివైపే చూస్తూ.. ఆసక్తికరంగా వాళ్ల సంభాషణనే వింటున్నట్లుగా ఉన్న సన్నివేశం కెమెరాకు చిక్కింది. ఆ ఫోటో ఎలా ఉందంటే చంద్రబాబు రమణ ఏం మాట్లాడుకుంటున్నారో అని నాయని ఆసక్తి కరంగా వింటున్నట్టు ఉంది.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…