
జై సమైఖ్య ఆంధ్ర పార్టీ ఎక్కడైనా కొంత పోటీ ఇచ్చింది అంటే అది పీలేరులో మాత్రమే. కిరణ్ సొంత నియోజకవర్గంలో ఆయన సోదరుడు కిశోర్ కుమార్‌రెడ్డి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. ఈ నియోజకవర్గంలో తెలుగు దేశం మూడవ స్థానంలోనే ఉండిపోయింది. ఇప్పుడు కిషోర్ తెలుగు దేశంలో జాయిన్ అవుతున్నారు.
పీలేరు నియోజకవర్గంలో ఆయనకి మంచి పట్టుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కిరణ్‌కుమార్‌రెడ్డి వివిధ పదవుల్లో ఉన్నప్పుడు ఆయన తరపున నియోజకవర్గంలో కిశోర్ క్రియాశీలకంగా వ్యవహరించేవారు. దీనితో కిరణ్ భవిష్యత్తు ఎలా ఉంటుందని ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో ఆయన బీజేపీ లేదా మళ్ళి కాంగ్రెస్ లో జాయిన్ కాబోతున్నారు అని పుకార్లు వచ్చాయి.
అయితే ఇది జరగలేదు. జరిగే అవకాశం కూడా కనిపించడం లేదు. జగన్ పార్టీలో జాయిన్ అవ్వడానికి ఆయన ఎప్పుడు ఇష్టపడరని ఆయన ఫాలోయర్స్ అంటున్నారు. ఇక మిగిలింది తెలుగు దేశం మాత్రమే. ఆయన సోదరుడు కూడా జాయిన్ అవ్వడంతో ఆయనకు పెద్దగా ప్రత్యామ్నాయం లేదనే చెప్పుకోవాలి. మరి ఆయన ఏంచేస్తారో చూడాలి!
For the first time in Bigg Boss history, there is a double eviction in the…
Toxic has emerged as an epic disaster at the box office. While the movie bombed…