మహేష్ తో కలిసి నటించేది లేదు!

ప్రిన్స్ మహేష్ బాబుతో వెండితెరను పంచుకోవాలనుకునే వారి సంఖ్యకు కొదవుండదు. మరి అలాంటి అవకాశం వస్తే కాదనే వారు ఎంత మంది ఉంటారు. అయితే అలాంటి ఛాన్సే లేదంటున్నారు ప్రిన్స్ సతీమణి నమ్రత. తాజాగా దినపత్రికకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్పష్టం చేసారు.

వెండితెరపై మరోసారి మహేష్ తో కనిపించే అవకాశం ఉందా? అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ‘లేదనే భావిస్తున్నాను’ అంటూ ఖచ్చితమైన జవాబు ఇచ్చారు నమ్రత. ఇక, తన కుటుంబ విషయాలను చెప్పుకొచ్చిన ప్రిన్స్ భామ… మహేష్ కు హైదరాబాద్ బిర్యానీ అంటే ఎంతో ప్రియమని, గౌతమ్ కు పిజ్జా అంటే ఇష్టమని, నేను ఆంధ్ర భోజనం వైపుకు మొగ్గు చూపుతానని తెలిపారు.

ADVERTISEMENT

పిల్లలిద్దరి భవిష్యత్తు వారి అభిష్టాల మేరకు ఉంటుందని, తామిద్దరి అభిప్రాయాలు పిల్లలపై ఉండవని, ఏడాదిలో మూడు సార్లు టూర్లకు వెళుతుంటామని, బయట ఒత్తిడులన్నీ మరిచిపోయి ఫ్యామిలీ అంతా అవి బాగా ఎంజాయ్ చేస్తామని నమ్రత శిర్కొదర్ చెప్పారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

The Family Man: Mirzapur Blockbuster Opens a New Door?

Mirzapur: The Film was released recently and had a huge box office opening. It received…

2 minutes ago

BB10: Who Is Strong & Who Gets Sympathy?

The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…

6 hours ago