
ఈ ఏడాది బాలయ్య ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’, ‘యన్.టి.ఆర్: మహానాయకుడు’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశపరిచారు. దీనితో ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని బాలయ్య కృతనిశ్చయంతో ఉన్నారు. గతంలో బాలయ్యతో జైసింహా చేసిన కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుంది. ఈరోజు ఉదయం నుండి లోకల్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో సినిమాలో కీలకమైన భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నారు.
సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, భూమిక చావ్లా, జయసుధ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలయ్య వందవ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణికి స్వరాలు కూర్చిన చిరంతన్ భట్ సంగీతం అందిస్తుండగా.. రామ్‌ప్రసాద్ కెమెరా వర్క్‌ను అందిస్తున్నారు. తొలుత ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చెయ్యాలని అనుకున్నా ఎక్కువ సినిమాలు రేసులో ఉండటంతో క్రిస్మస్ కే విడుదల చెయ్యడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారని సమాచారం.
Prabhas’ Fauzi teaser received a mixed response on social media, with criticism over its visual…
Vijay Sethupathi's Baththa directed by Balaji Tharaneetharan and produced by Atlee, was released in theatres…