
ఇప్పటికే గోపీచంద్ మలినేని సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లిన బాలకృష్ణ, తన తదుపరి సినిమాను మరో యువ దర్శకుడు అనిల్ రావిపూడి చేతిలో పెట్టినట్లుగా తెలుస్తోంది. తాజాగా వెలుగు చూస్తోన్న మరో సెన్సేషనల్ న్యూస్ ఏమిటంటే… రాజమౌళి మాదిరిగానే అపజయం ఎరుగని దర్శకుడిగా కీర్తి గడించిన కొరటాల శివ – బాలయ్య కాంబో సెట్స్ పైకి వెళ్లబోతోందట.
ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాను ముగించే పనిలో ఉన్న కొరటాల శివ, తన తదుపరి సినిమాను జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోతున్నారు. వీరిద్దరి కాంబోలో గతంలో ‘జనతా గ్యారేజ్’ రాగా, ఇప్పుడు రాబోయే సినిమా అంతకుమించి ఉంటుందంటూ కొరటాల శివ ఇప్పటికే వెల్లడించారు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణతో సినిమా సెట్స్ పైకి వెళ్తుందనేది లేటెస్ట్ టాక్.
సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకుని, వాటికి కమర్షియల్ కోణపు రంగులను అదిమి, బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కొట్టడంలో కొరటాల శివ నైపుణ్యత తెలియనిది కాదు. దీనికి నందమూరి నటసింహం బాలకృష్ణ వంటి మాస్ హీరో తోడయితే, ప్రస్తుతం క్రేజీగా మారిన ఈ కాంబోపై నందమూరి అభిమానులైతే భారీ అంచనాలే పెట్టుకున్నారు.
గతంలో ఒక సక్సెస్ వచ్చిన తర్వాత ఏదొక దర్శకులకు అవకాశం ఇచ్చేయడం బాలకృష్ణకు పరిపాటి. కానీ ప్రస్తుతం బాలకృష్ణ సినిమాల క్యూలో ఉన్న దర్శకుల జాబితాను పరిశీలిస్తే… ‘మినిమం గ్యారెంటీ మూవీ’ అనే నమ్మకాన్ని అందించే డైరెక్టర్లు. ఈ వరుస ఇలాగే కొనసాగితే టాలీవుడ్ లో మరో “బిగ్ బి” మాదిరి అనేక రకాల విభిన్నమైన పాత్రలను పోషించే అవకాశాన్ని బాలయ్య సొంతం చేసుకున్నట్లే!
The teaser for Sunny Deol’s next, Suryaa, is out now. The movie was announced a…
Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu has defended the direct election of mayors and…