మెగా అభిమానుల మాదిరే నందమూరి ఫ్యాన్స్ కూడా!

ntr balakrishna cold warపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేంద్రంగా మెగా అభిమానుల్లో వచ్చిన చీలిక అందరికీ తెలిసిందే. ఇది ఎవరు ఒప్పుకున్నా లేకున్నా కాదనలేని సత్యం. ఒకప్పుడు అంతా మెగా వర్గమై వెలిగిన అభిమానగణం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
కు వచ్చిన క్రేజ్ దృష్ట్యా, పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న వైఖరి రీత్యా, పవన్ అభిమానులు చేస్తున్న హడావుడి దాఖలా… తదితర అంశాలను ప్రామాణికంగా మారిన తరుణంలో మెగా ఫ్యామిలీతో పాటు అభిమానుల్లోనూ చీలికలు వచ్చాయి.
అయితే దీనిపై ఇప్పటికే ఓ స్పష్టత వచ్చేసింది. ‘మెగా’ అనేది ఒక వర్గంగానూ, ‘పవన్’ మరో వర్గంగానూ రూపాంతరం చెందిన విషయాలు పాతవే. అయితే ఇదే బాటలో నందమూరి అభిమానుల్లోనూ చీలికలు మరోసారి బహిర్గతమయ్యాయి.

“నాన్నకు ప్రేమతో” విడుదల సందర్భంగా చెలరేగిన విబేధాలు “డిక్టేటర్” విడుదల సమయానికి పతాక స్థాయికి చేరుకున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ వ్యవహార తీరు అంశంతో ఉత్పన్నమైన బేధాభిప్రాయాలు అభిమానులు రెండుగా చీలిపోయే పరిస్థితికి తీసుకువచ్చాయని ఇండస్ట్రీ వర్గాలు గత కొన్ని సంవత్సరాలుగా చెప్పుకుంటున్నాయి. బాలకృష్ణ చేసిన స్పష్టమైన ప్రకటనలు నందమూరి అభిమానుల విభేదాలకు ఊతమిచ్చాయి. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా “నాన్నకు ప్రేమతో వర్సెస్ డిక్టేటర్” పోటీ హాట్ హాట్ గా జరుగుతోంది.

“నాన్నకు ప్రేమతో” సినిమాకు వచ్చిన భిన్న స్పందనలు రావడంతో, జూనియర్ అభిమానులు “డిక్టేటర్” ఫలితం గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరికొద్ది గంటల్లో ఈ సినిమా ఫలితం కూడా తెలిసిపోతుంది. అయితే, ఒకప్పుడు
నందమూరి సినిమాలన్నీ మెగా వర్గంతో పోటీ పడేవి. అలాగే మెగా సినిమాలు కూడా! కానీ, ఈ రెండు వర్గాలలో జరుగుతున్న పరిణామాలతో అంతర్లీన పోటీ అనివార్యమైంది. మరి వీటికి శుభంకార్డు ఎప్పుడు పడుతుంది? అసలు
పడుతుందంటారా?

ADVERTISEMENT
Latest Stories