
రామకృష్ణ సోదరుడు నందమూరి మోహనకృష్ణ కుమారుడు తారకరత్న గత నెల 27వ తేదీన గుండెపోటు రావడంతో అప్పటి నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.
నందమూరి కుటుంబానికి కారు ప్రమాదాలు శాపంగా మారిన్నట్లున్నాయి. నందమూరి హరికృష్ణ 2018, ఆగస్టు 29న నల్గొండ జిల్లా అన్నెపర్తి వద్ద కారు ప్రమాదంలో మరణించారు. నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకీరామ్ 2014, డిసెంబర్ 6వ తేదీన నల్గొండ జిల్లాలోనే కోదాడ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. జూ.ఎన్టీఆర్ కూడా 2009లో ఖమ్మంలో ఎన్నికల ప్రచారం ముగించుకొని కారులో హైదరాబాద్ తిరిగివెళుతుండగా కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నందమూరి రామకృష్ణ ఈ కారు ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.
The Cockroach Janata Party (CJP) protests have become a major talking point across the country.…
Devi Sri Prasad and Sukumar have shared a memorable musical journey for nearly two decades,…