
బాలకృష్ణ అన్నయ్య మోహనకృష్ణ వారసుడిగా తారకరత్న గురించి బయట ప్రపంచానికి తెలిసింది 2002 మార్చి 24న. ఎవరికీ సాధ్యం కాని విధంగా ఒకే రోజు తొమ్మిది సినిమాలు ప్రారంభోత్సవం జరుపుకున్న తొలి డెబ్యూ హీరోగా మొదటి అడుగే సంచలనంగా నమోదు చేసుకున్నాడు. అంగరంగవైభవంగా జరిగిన అప్పటి వేడుకకు వచ్చిన జన సందోహం, కుటుంబ సభ్యుల కోలాహలం గురించి పత్రికల్లో కథలుగా వచ్చాయి. వాటిలో సగానికి పైగానే రిలీజయ్యాయి. మిగిలినవి కాంబినేషన్లు మారి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
ఒకటో నెంబర్ కుర్రాడుతో హీరోగా మొదలుపెట్టి అమరావతిలో విలన్ గా చేయడం దాకా తారకరత్న ఎన్నో ప్రయోగాలు చేశాడు. దురదృష్టవశాత్తు కమర్షియల్ సక్సెస్ కాలేకపోవడం కెరీర్ ని పరిమితం చేసింది. నటుడిగా నంది అవార్డు అందుకున్నా వసూళ్లు తెచ్చే సినిమాలు లేకపోవడం మైనస్ గా మారింది. వ్యక్తిగత జీవితంలో తారకరత్న చాలా ఒడిదుడుకులు చూశాడు. ప్రేమ వివాహం వల్ల కొంత కాలం ఫ్యామిలీకి దూరం కావడం, ఆ సమయంలో సమస్యలు చుట్టుముట్టడం ఇలా ఎన్నో చవి చూడాల్సి వచ్చింది.
2012లో అలేఖ్యరెడ్డితో పెళ్లి తర్వాత తిరిగి కుటుంబం దగ్గర కావడంతో కుదుటపడిన తారకరత్న నటుడిగా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేసినా ఫలితాలు మాత్రం ఫ్లాపుల రూపంలో రిపీట్ అవుతూనే వచ్చాయి, ఇటీవలే టిడిపి పార్టీలో చేరి సేవలందించాలని నిర్ణయం తీసుకున్న కొంత కాలానికే ఇలా జరగడం తీవ్రవిషాదం. కెరీర్ పరంగా తను గొప్ప ఎత్తులను చూసి ఉండకపోవచ్చు. కానీ లైఫ్ లో అన్నీ చవి చూశాడు. కనిపించని విలన్ తో జబ్బు రూపంలో ఎంత ఫైట్ చేసినా చివరికి ఇక్కడా ఓటమికి తలవంచక తప్పలేదు.
Following the terrible failure of Coolie, Rajinikanth is all set to return with his next…
Koffee with Karan may be ending but Karan Johar is not ready to say goodbye…