
జిల్లాలోనే పాములపాడు మండల అధ్యక్షుడు చెల్లే హరనాథ్ రెడ్డి నేతృత్వంలో టిడిపి నాయకులు తిమ్మారెడ్డి, రవీంద్ర రెడ్డి, మధుకృష్ణ గోవిందు, శంకర్ స్వామి, కరీంబాషా, షాహిన్ బాషా, లింగేష్ గౌడ్, అర్జున్ గౌడ్, పూసల కృష్ణ, శంకర్ గౌడ్, వెంకట కృష్ణారెడ్డి,రాము, ఈశ్వర్, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “వైసీపీ అధికారంలోకి వస్తే పరిశ్రమలు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. కానీ ఇప్పుడు ఉన్న పరిశ్రమలే మూసుకొని పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోతుండటంతో ఏపీలో యువత ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూర్ వంటి పొరుగు నగరాలకు వెళ్ళవలసివస్తోంది. మన యువత పొరుగు రాష్ట్రాలకు వెళ్ళవలసి వస్తున్నందుకు వైసీపీ ప్రభుత్వం సిగ్గుతో తల దించుకోవాలి. పరిశ్రమలు, పెట్టుబడులు సాహించి యువతకు ఉద్యోగాలు కల్పించకపోగా అన్నిటి ఛార్జీలు పెంచేసి సామాన్య ప్రజలపై సిఎం జగన్మోహన్ రెడ్డి చాలా భారం మోపుతుండటం చాలా బాధాకరం. పైగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా వైసీపీ నేతల అరాచకాలు, దౌర్జన్యాలు. జగన్ ఇష్టారాజ్యంగా పాలన చేస్తుండటంతో రాష్ట్రం అన్ని రంగాలలో భ్రష్టు పట్టిపోయింది. జగన్ పాలన చూసి ప్రజలు వేశారిపోయారు. ఎన్నికలలో గద్దె దింపడానికి ఎదురుచూస్తున్నాన్నారు.” అని అన్నారు
Bigg Boss Telugu is one of the most entertaining reality shows in the world. The…
Prabhas is heading towards another massive box-office clash, with Sandeep Reddy Vanga's Spirit scheduled to…