
సరిపోదా శనివారం అంటూ నాచురల్ స్టార్ నాని పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియచేస్తూ శనివారం నాడు సరిపోదా శనివారం సినిమా గ్లిమ్స్ విడుదల చేసారు చిత్ర యూనిట్.
దీనితో మూవీ పేరులో శనివారం, నాని బర్త్ డే శనివారం, గ్లిమ్స్ విడుదల కూడా శనివారం…రావడంతో ఈ సినిమాకు శనివారం సెంటిమెంట్ కలిసొచ్చేలా ఉంది అంటూ నానికి, నాని సినిమాకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నారు నాని అభిమానులు.
1 .25 సెకండ్న్ల నిడివితో విడుదలైన మూవీ గ్లిమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. కోపాలు రకరకాలు…ఒక్కో మనిషికి ఒక్కో రకంగా ఉంటుంది…అయితే ఆ కోపాన్ని ఒక క్రమబద్ధంగా వారంలో ఒక్క రోజు మాత్రమే చూపించే పిచ్చి నాకొడుకుని ఎవరైనా చూసారా..? నేను చూసా..అంటూ వచ్చే నాని ఎలివేషన్ సీన్ కు పేరు సూర్య…రోజు శనివారం…అంటూ నాని ఇచ్చే సమాధానం హైలెట్ గా నిలిచింది.
చివరిలో తమిళ దర్శకుడు ఎస్ జె సూర్య పోలీస్ ఆఫీసర్ గెటప్ లో హ్యాపీ బర్త్ డే బ్రదర్ అంటూ ముగించారు. అయితే ఈ సరిపోదా శనివారం మూవీ గ్లిమ్స్ నాని అభిమానుల అంచనాలను సరిపెట్టింది. గ్లిమ్స్ లో వచ్చిన డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, నాని లుక్ అంతా మూవీ కి చక్కగా సరిపోయింది. ఈ సినిమాతో నాని మరోసారి మాస్ క్యారెక్టర్ ను ఎంచుకున్నట్టుగా ఉంది.
మొన్న విడుదలైన హాయ్ నాన్నతో క్లాసీ లుక్ లో క్లాస్ హిట్ ను అందుకున్న నాని ఈ సారి మాస్ లుక్ లో దర్శనమిచ్చారు. తన సహజ నటనతో ఫామిలీ ఇమేజ్ దక్కించుకున్న నాని అందరి హీరోల అభిమానులలోనూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. సరిపోదా శనివారం సినిమా గ్లిమ్స్ సినిమా మీద అంచనాలను పెంచి ప్రేక్షకులలో సినిమా పట్ల ఆసక్తిని రేకెత్తించింది.
డివివి దానయ్య నిర్మాతగా, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో నాని, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా, ఎస్ జె సూర్య, సాయి కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సరిపోదా శనివారం ఆగస్టు 29 గురువారం థియేటర్ల ముందుకు రానుంది అంటూ చిత్ర బృందం తెలిపింది. సరిపోదా శనివారం అంటూ మూవీ విడుదలను గురువారంతో సరిపెట్టారుగా.
Booking an H-1B visa appointment has become increasingly difficult for Indian applicants. Many users say…
In the 24th match of IPL 2026 at the Wankhede Stadium, Punjab Kings continued their…