
ఓ సెల్ఫీ వీడియోతో స్వీట్ సర్ ప్రైజ్ రాబోతోంది అంటూ ప్రచారం చేసిన నాని, ఆ తర్వాత విడుదల చేసిన చిన్న టీజర్ తో శ్రోతలతో పాజిటివ్ వైబ్ ను కలిగించాడు. అయితే అసలు సినిమా ముందుంది అంటూ… ఊరిస్తూ వచ్చిన నాని, ఎట్టకేలకు ఆ పాటను పూర్తిగా విడుదల చేసారు. లిరికల్ వీడియోలా కాకుండా నాని పాడుతున్న ప్రమోషనల్ సాంగ్ గా విడుదల చేసిన ఈ పాటకు ‘అంత సీన్ లేదంటూ’ సంగీత ప్రియులు తేల్చేసారు.
గోపి సుందర్ సంగీతం అందించిన ఈ పాటను సిడ్ శ్రీరామ్ ఆలపించారు. అసలు పాట ఓపెనింగ్ లోనే శ్రీరాం స్వరం నానికి ఏ మాత్రం సెట్ కాకపోవడంతో, ఇక వినాలన్న ఆసక్తి నెమ్మదిగా సన్నగిల్లుతుంది. సాహిత్య పరంగా శ్రిజో కొంతవరకు సంతృప్తి పరిచినప్పటికీ, గోపి సుందర్ సంగీతం మరియు శ్రీరామ్ స్వరం కలగలిపి ఈ పాటను ప్రేక్షకులకు చేరువ చేయడం కష్టమేనని చెప్పవచ్చు.
బహుశా ఎలాంటి ఓవర్ పబ్లిసిటీ లేకుండా రిలీజ్ చేసి ఉంటే, మరీ ఇంత నెగటివ్ అభిప్రాయం కలిగేది కాదేమో గానీ, నాని ఇచ్చిన హైప్ తో ఈ పాటను ఎవరూ అడగాల్సిన అవసరం లేకుండా పోయింది. బహుశా సినిమాలో అయినా గాయకుడ్ని మారిస్తే ఎంతోకొంత ప్రేక్షకులకు చేరువయ్యే అవకాశం ఉంటుంది గానీ లేదంటే రియాక్షన్స్ దారుణంగా ఉండే అవకాశము లేకపోలేదు. ఈ పాటకు వచ్చిన స్పందన తర్వాత “హైప్” విలువ ఏమిటో నానికి తెలిసి వచ్చుంటుందని చెప్పడంలో సందేహం లేదు.
Romanchakam is produced by Bhadrakali Pictures, the banner of Sandeep Vanga and Pranay Vanga, who…
Ravi Teja made a comeback of epic proportion with his latest film Irumudi. This devotional…