Telugu

ప్యారడైజ్ చూసేందుకు నానిని అనుమతించడం అవసరమా?

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన ‘ది ప్యారడైజ్’ గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. కనుక తెలంగాణ ప్రభుత్వం అనుమతితో ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు ప్రీమియర్ షో వేస్తారు.

హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ వద్ద గల సంధ్య థియేటర్లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూసేందుకు అనుమతించాలని తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కోరుతూ నాని ట్వీట్‌ చేశారు. భద్రతా నిబంధనలు, అవసరమైన ప్రోటోకాల్స్‌ పాటిస్తామని హామీ ఇచ్చారు.

ADVERTISEMENT

నాని విజ్ఞప్తిపై సిఎం రేవంత్‌ రెడ్డి సానుకూలంగా స్పందించారు. భద్రతా మార్గదర్శకాలను గౌరవిస్తున్నందుకు నానికి అభినందనలు తెలిపి, అనుమతి కోరుతూ స్థానిక పోలీస్ స్టేషన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సిఎం రేవంత్‌ రెడ్డి బదులిచ్చారు.

అయితే 2024, డిసెంబర్‌ 4న అదే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద సంధ్య థియేటర్లో పుష్ప-2 ప్రీమియర్ చూసేందుకు అల్లు అర్జున్‌ వచ్చినప్పుడు రేవతి అనే వివాహిత తొక్కిసలాటలో చనిపోగా, తీవ్రంగా గాయపడిన ఆమె కుమారుడు నేటికీ వైద్య చికిత్స పొందుతూనే ఉన్నాడు.

ఈ ఘటన, తదనంతర పరిణామాలు అందరికీ గుర్తుండే ఉంటాయి. ఈ ఘటనపై సిఎం రేవంత్‌ రెడ్డి శాసనసభలో మాట్లాడుతూ, “నేను ఈ సిఎం కుర్చీలో ఉన్నంత వరకు ఇకపై సినిమా టికెట్ ధరలు పెంచడానికి, ప్రత్యేక షోల ప్రదర్శనలకు అనుమతించను,” అని శపథం చేశారు.

కానీ ఆ తర్వాత అనేక సినిమాలకు అనుమతించారు. తాజాగా నాని ప్యారడైజ్ సినిమాని అనుమతించడమే కాకుండా, థియేటర్లో అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు నానిని అనుమతించారు. పోలీసులు అనుమతి తీసుకోమని సిఎం రేవంత్‌ రెడ్డి సూచించినప్పటికీ, డీజీపీని ట్యాగ్ చేయడం ద్వారా నానికి అనుమతి ఇచ్చినట్లే భావించవచ్చు. కనుక థియేటర్ పరిసర ప్రాంతాలలో భారీగా పోలీసులను మొహరించి ఎటువంటి అవాంచనీయమైన ఘటనలు జరుగకుండా ఏర్పాట్లు చేస్తారని వేరే చెప్పక తప్పదు.

అయినా కూడా ఒకవేళ మళ్ళీ అవాంచనీయ ఘటన జరిగితే ఈసారి ఎవరు బాధ్యత వహిస్తారు? అసలు ఇక ఎన్నటికీ అనుమతించే ప్రసక్తి లేదని చెప్పి మళ్ళీ ఇన్ని సినిమాలు ఎందుకు అనుమతిస్తున్నట్లు? సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విచారణ ఇంకా కొనసాగుతూ ఉండగానే, మళ్ళీ ప్రీమియర్ షో చూసేందుకు నానిని అనుమతించడం అవసరమా? నాని కూడా అభిమానులతో కలిసి సినిమా చూడటం అవసరమా? అని ఆలోచిస్తే బాగుండేది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Amaravati and Policing Get Major AP Cabinet Push

The Andhra Pradesh Cabinet, led by Chief Minister Chandrababu Naidu, has approved four new police…

36 minutes ago

Is ICC Killing Bilateral ODIs? Big Change From 2027

The ICC could be planning a major change to the international cricket calendar, with bilateral…

1 hour ago