
విజయ్ పొలిటికల్ సక్సెస్ విషయంలో టాలీవుడ్ స్టార్స్ అందరూ ట్వీట్ చేశారు. చిన్న-పెద్ద హీరో అనే తేడా లేకుండా అందరూ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు. వాళ్లలో నాని కూడా ఒకడు. కానీ.. నాని మాత్రం బీభత్సమైన నెగిటివిటీ ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు మాత్రమే కాదు, నాని ఇలా పొలిటీషియన్స్ లేదా వేరే భాషకు చెందిన హీరోల సినిమాల గురించి ట్వీట్ వేసినప్పుడల్లా నాని బలవుతుంటాడు.
“జై భీమ్”కి నేషనల్ అవార్డ్స్ రానప్పుడు, “అంటే సుందరానికి” చిత్రానికి టికెట్ హైక్ ఆప్షన్ ఇవ్వనప్పుడు నాని రెస్పాండ్ అయిన విధానం లేనిపోని వివాదాలకి దారి తీసింది. ఇప్పుడు విజయ్ పొలిటికల్ విన్ పై వేసిన ట్వీట్ కూడా అలాంటి నెగిటివిటీకి దారి తీసింది.
నాని ట్వీట్ చేస్తూ.. “మా ఇంట కూడా ఇదే విధంగా జరిగింది, ఇప్పుడు పొరుగు రాష్ట్రంలోనూ అదే విధంగా జరగడం ఆనందంగా ఉంది” అని పోస్ట్ చేస్తూ.. “అబ్సోల్యూట్ పాలిటిక్స్” అని స్పెషల్ గా మెన్షన్ చేయడం పెద్ద రాద్ధాంతానికి దారి తీసింది.
దాంతో.. కొందరు నాని పేరుకే నేచురల్ స్టార్ కానీ, చాలా ఆర్టిఫీషియల్ గా ఉంటాడు అని కామెంట్ చేయగా.. ఇంకొందరేమో, డైరెక్ట్ గా విష్ చేయకుండా హోమ్, నైబర్ హుడ్ అని ఎక్ట్రాలు యాడ్ చేయడం ఎందుకు అని దుమ్మెత్తిపోశారు. మరీ ముఖ్యంగా రైవల్ పొలిటికల్ పార్టీలు నానిని భీభత్సంగా టార్గెట్ చేశాయి.
ఈ క్రమంలో పాపం నాని అనవసరంగా ట్రోల్ అవుతున్నాడు, నాని ఫ్యాన్స్ కూడా డిఫెండ్ చేయలేక సైలెంట్ అయిపోయారు. ప్రతిసారి నాని ఇలా టార్గెట్ అవ్వడం ఎందుకో అర్థం కాదు.
తమిళనాడు ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చర్చనీయాంశాలుగా మారిపోయాయి. ముఖ్యంగా స్టాలిన్ ఓటమి పై విజయ్ గెలుపు పై వైసీపీ…
ఇండియన్ పాలిటిక్స్‌లో ఇలాంటి రోజు చాలా అరుదు. అధికారంలో ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక్కేసారి కుర్చీ మాత్రమే కాదు, తమ…