
పోస్టర్ లో ఒక వ్యక్తి రెండు చేతులలో రెండు గన్లతో షూట్ చేస్తున్నాడు. దీనితో వీ అంటే వయోలెన్సా అనే అనుమానాలు వస్తున్నాయి. దిల్ రాజు ప్రొడక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ప్రస్తుతం సగం షూటింగ్ ని పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ వీలైనంత త్వరగా మిగతా వర్క్ ని కూడా ఫినిష్ చేసే పనిలో ఉన్నారు.
నాని ఎక్కువగా యాక్షన్ సీన్స్ ఉండే సినిమాలు చేయడని.. కొందరు ఆయనపై విమర్శలు కూడా చేస్తుంటారు. అలాంటి వారి కోసమే నాని చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం అభిమానులను ఆకట్టుకుంటుంది. వయోలెన్స్ కావాలన్నారుగా, ఇస్తా ఉగాదికి సాలిడ్‌గా ఇస్తా అని నాని ట్వీట్ చేశారు. ప్రస్తుతం వీ షూటింగ్ నార్త్ ఇండియా లో జరుగుతుంది.
నివేత థామస్ – అదితి రావ్ హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందించనున్నాడు. ఈ సంగీత దర్శకుడు ఇంతకుముందు సైరా సినిమాకు మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే. నానిని అష్టాచెమ్మా తో హీరోని చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
Prabhas is celebrating his birthday, and fans have found yet another reason to celebrate the…
ఆంధ్రప్రదేశ్‌లో ఇదివరకు ఎన్నడూ చూడని సరికొత్త భయానక వాతావరణం మున్సిపల్ ఎన్నికల నామినేషన్స్ ప్రక్రియలో కనిపిస్తోంది. ఇంతవరకు జరిగిన, ఇంకా…