
ఇటీవల విడుదలైన ఈ సినిమా ఏకంగా టాలీవుడ్ ఆల్ టైం టాప్ 3లో చోటు సంపాదించడం ఊహించిన విషయం కాదు. కానీ, ‘నాన్నకు ప్రేమతో’ సినిమాతో వచ్చిన అన్ని వర్గాల పాజిటివ్ ప్రభావం ‘జనతా గ్యారేజ్’ కొత్త రికార్డులకు దోహదం చేసింది. దీంతో యంగ్ టైగర్ తో పాటు అభిమాన గణం కూడా మిక్కిలి సంతోషంలో మునిగి తేలుతోంది. వెండితెరను ఏలిన జూనియర్ ఎన్టీఆర్, బుల్లితెరపై కూడా రికార్డులు సృష్టించడానికి సన్నద్ధమవుతున్నారు.
సంక్రాంతి బ్లాక్ బస్టర్ “నాన్నకు ప్రేమతో” సినిమా ఈ దసరా కానుకగా బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతోంది. దీంతో బుల్లితెరపై కొత్త టీఆర్పీ రేటింగ్స్ నమోదవుతాయనే అంచనాలు ఉన్నాయి. క్లాస్, మాస్ అన్న తేడా లేకుండా, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందడంతో, బుల్లితెరపై కూడా “నాన్నకు ప్రేమతో” సినిమాకు పట్టం కడతారని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమా ప్రసారానికి సంబంధించిన ప్రోమోలు ఇప్పటికే విడుదలై, తారక్ అభిమానులను దసరా కోసం నిరీక్షించేలా చేస్తున్నాయి.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…