Telugu

సాక్షిలో లోకేష్ పై ప్రశంసలు…

తగ్గితే ఎంత నెగ్గుతారు.? తప్పుఒప్పుకుంటే ఎంత గౌరవం వస్తుంది.? బాధ్యత వహిస్తే ఎంత విలువ పెరుగుతుంది.? రాజకీయాలలో జవాబుదారీతనం ప్రత్యర్థి చేత కూడా ప్రశంసలు కురిపించగలుగుతుంది అనేదానికి నారా లోకేష్ ఉదాంతం చక్కటి ఉదాహరణంగా నిలుస్తుంది.

తాజాగా ఎన్టీఆర్ జిల్లా దేవుని చెరువు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పెట్టె డొక్కా సీతమ్మ మధ్యాన భోజన పథకంలో నాణ్యత లేదని, నాసిరకం భోజనం పిల్లలకు ఆహారంగా అందిస్తున్నారని, ఆ ఆహారాన్ని తినలేక విద్యార్థులు ఆ భోజన ప్లేట్లను చెత్తబుట్టలో పడేస్తున్న వీడియో పై విద్యా శాఖ మంత్రిగా నారా లోకేష్ వెంటనే స్పందించారు.

ADVERTISEMENT

సదరు పాఠశాల ప్రిన్సిపాల్ ని సస్పెండ్ చేస్తూ వెంటనే చర్యలు తీసుకున్నారు, అలాగే మరోసారి ఇటువంటి పొరపాటు జరగకుండా పటిష్ట తనిఖీలు నిర్వహిస్తామని, ఇప్పుడు జరిగిన దానికి గాను ఆ శాఖ మంత్రిగా విద్యార్థులకు, ఆయా విద్యార్థుల తల్లి తండ్రులకు తన వైపు నుంచి మనస్పూర్తి గా క్షమాపణలు కోరుతున్నట్టు ప్రకటన చేశారు.

దీనితో లోకేష్ స్పందించిన తీరు పట్ల ఇంట బయట ప్రశంసలు వెల్లువెత్తాయి. అలాగే అటు సోషల్ మీడియాలో సైతం నాయకుడు అంటే ఇలా కదా ఉండాలి, రాజకీయాలలో నాయకుల నుంచి ప్రజలు ఆశించేది ఈ జవాబుదారీతనమేగా అంటూ లోకేష్ పై పొగడ్తల వర్షం కురిసింది.

అయితే ఇదంతా ఒకెత్తుగా ఉంటే, లోకేష్ బాగున్నారా అన్నదానికి కూడా బూతు వెతికే సాక్షి ఈ అంశం పై తమ ఛానెల్ లో డిబేట్ నిర్వహించింది. కూటమి ప్రభుత్వంలో పిల్లలకు ఇటువంటి నాసిరకం భోజనం పెడుతున్నారా అంటూ డిబేట్ మొదలుపెట్టిన సదరు యాంకర్ తమ అస్మదీయులను దీని పై స్పందించమని కోరారు.

అయితే రాజకీయ విశ్లేషకుల రూపంలో వైసీపీ ఏజెండాలు పలికే సదరు విశ్లేషకులు సైతం నాసిరకం భోజనాన్ని పక్కన పెట్టి, ఆ తప్పిదం పై లోకేష్ స్పందించిన తీరుని, ఆయన తక్షణమే తీసుకున్న చర్యలను, ఆ పై చెప్పిన క్షమాపణలను కొనియాడారు.

తమ ప్రభుత్వంలో తప్పుజరిగింది అని లోకేష్ ఒప్పుకోవడం, మంత్రిగా క్షమాపణలు చెప్పడం నిజంగా ప్రశంసించదగ్గ అంశమని, ఇది ఆయన రాజకీయ హుందాతనానిని నిదర్శమని లోకేష్ పై సాక్షి డిబేట్ లో పొగడ్తలు రావడంతో లోకేష్ తన రాజకీయం తో నిజంగానే ప్రత్యర్థుల మనసు గెలిచారనే చెప్పాలి.

అయితే సాక్షి యాంకర్ ఎదో ఆశిస్తే సదరు విశ్లేషకుల నుంచి మరేదో స్పందన రావడంతో ఇక కక్కలేక మింగలేక సదరు యాంకర్ గారు నీళ్లు నమిలారు. ఏదిఏమైనా సాక్షి డిబేట్ లో లోకేష్ పై ప్రశంసలు అంటే దానికొచ్చే కిక్కే వేరప్పా అంటూ టీడీపీ అభిమానులు సాక్షి వీడియో ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Pics: Ridhima Serves Ivory Glam With A Bold Twist

Ridhima Tiwari gives ivory dressing a fearless fashion refresh in this striking photo set. Draped…

6 minutes ago

SRK’s King: Will Too Many Stars Become Biggest Problem?

Shah Rukh Khan's King already has one of the biggest ensemble casts among upcoming Hindi…

26 minutes ago