Telugu

యువగళం తొలి హామీ… ‘డయాలసిస్ సెంటర్‌’ రెడీ

నారా లోకేష్‌ యువగళం పాదయాత్రలో ప్రతీ వంద కిలోమీటర్లలో స్థానిక ప్రజల సమస్యలు, అవసరాలు తెలుసుకుంటూ వాటికి అవసరమైన ఏర్పాట్లు చేస్తానని హామీ ఇస్తూ శిలాఫలకాలు వేశారు.

ADVERTISEMENT

ఆ విదంగా చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మొదటి వంద కిలోమీటర్లు పూర్తిచేసినప్పుడు, చుట్టుపక్కల కిడ్నీ రోగులకు డయాలసిస్ చేసుకునేందుకు జిల్లా కేంద్రానికి వెళ్ళి రావడం చాలా భారంగా మారుతోందని చెప్పడంతో, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజులలోనే అక్కడ డయాలసిస్ సెంటర్‌ ఏర్పాటు చేయిస్తానని నారా లోకేష్‌ గ్రామ ప్రజలకు హామీ ఇస్తూ, ఆ మేరకు శిలాఫలకం కూడా వేయించారు.

ఒకవేళ తాను మాట తప్పితే తనను ఆ శిలాఫలకం చూపించి ప్రజలు తనని నిలదీయవచ్చని నారా లోకేష్‌ చెప్పారు. గ్రామస్తులకు ఇచ్చిన్న మాట ప్రకారం వందరోజులలోపే బంగారుపాళ్యంలో డయాలసిస్ సెంటర్‌ ఏర్పాటు చేయిస్తున్నారు.

నారా లోకేష్‌ మంత్రిగా చాలా బిజీగా ఉన్నప్పటికీ ఇచ్చిన మాట మరిచిపోకుండా బంగారుపాళ్యంలో అత్యాధునిక సదుపాయాలతో డయాలసిస్ సెంటర్‌ ఏర్పాటు చేయిస్తునందుకు పరిసర గ్రామాలలో ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే మంత్రి నారా లోకేష్‌ స్వయంగా ఈ డయాలసిస్ సెంటర్‌ ప్రారంభోత్సవం చేయనున్నారు.

యువగళం పాదయాత్ర హామీల అమలుకి దీంతో మంత్రి నారా లోకేష్‌ శ్రీకారం చుట్టారు కనుక మిగిలిన హామీలన్నిటినీ ప్రాధాన్యతా క్రమంలో అమలుచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. యువగళం పాదయాత్రతో నారా లోకేష్‌ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చాలా దగ్గర నుంచి చూశారు.

అవన్నీ జీవితంలో తనకు అనేక కొత్త పాఠాలు నేర్పాయని నారా లోకేష్‌ స్వయంగా చెప్పారు. మంత్రిగా అవి ఆయనకు ఇప్పుడు ఎంతగానో ఉపయోగపడతాయి కూడా.

యువగళం పాదయాత్రతో నారా లోకేష్‌ ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవడమే కాకుండా, తన సమర్దతని ప్రజలు, ముఖ్యంగా వైసీపి నేతలు కూడా గుర్తించేలా చేయగలిగారు. బహుశః అందుకే వైసీపి నేతలు ఎవరూ ఇప్పుడు ‘నారా లోకేష్‌’ పేరు పలకడానికి కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సివస్తోందని చెప్పవచ్చు.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

TDP-Jana Sena-BJP: Who Gets the Key Seats?

The TDP, Jana Sena and BJP scripted a major victory in the 2024 Andhra Pradesh…

16 minutes ago

Chiranjeevi’s Vishwambhara: Is Dasara Surprise on Cards?

Chiranjeevi's Vishwambhara has been waiting for its theatrical release for a long time. Fans are…

45 minutes ago