
పక్క రాష్ట్రం తెలంగాణలో కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ఐటీ, మున్సిపల్ మంత్రిగా ఉండటం, శాఖలపై పట్టు పెంచుకుంటూ, తదుపరి తానే ముఖ్యమంత్రినన్న భావన కలిగిస్తుండటంతో, లోకేశ్ ను అలా తయారు చేయాలన్న వాదన చాలా రోజులుగా వినిపిస్తున్నప్పటికీ, చంద్రబాబు పక్కనబెట్టారు. పార్టీలో రెండో అధికార కేంద్రం ఉండటాన్ని ఎన్నడూ ఇష్టపడని చంద్రబాబు, లోకేశ్ విషయంలో మాత్రం ఒకింత మెట్టుదిగి, ఏది ఎప్పుడు జరగాలో, అప్పుడు జరుగుతుందని అన్నారు.
నేరుగా పార్టీ కోసం పనిచేస్తున్న లోకేశ్, పెద్ద అవకాశం వస్తే, బాగా ఎదుగుతాడని చంద్రబాబు వ్యాఖ్యానించడం క్యాబినెట్ చేరికను ఖరారు చేసినట్టేనని పార్టీ వర్గాలు వ్యాఖ్యానించాయి. కాగా, సెప్టెంబర్ లో అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం దసరాలోపు మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు ఉండటంతో, అప్పుడు లోకేశ్ చేరిక ఖాయంగా తెలుస్తోంది.
Director Sandeep Reddy Vanga had been tasting phenomenal success right from the early stages of…
Small films are releasing in large numbers in Tollywood, but very few are making a…