Telugu

నీ లిక్కర్ షాప్ ముందే తేల్చుకుందాం! ఆంధ్రా గోల్డ్ బ్రదర్!

లోకేష్ ప్రత్యర్థుల పై రాజకీయ విమర్శలలో రోజురోజుకి వ్యంగ్యం మోతాదుని పెంచుకుంటూ పోతున్నారు. ప్రెస్ మీట్లకు వస్తే బ్లూ మీడియాను తన స్టైల్ లో ర్యాగింగ్ చేస్తూ ఒక ఆట ఆడుకుంటున్నాడు అంటూ ఇప్పటికే టీడీపీ శ్రేణులు లోకేష్ వ్యాఖ్యలను సామజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

అయితే తండ్రి అరెస్టుతో జగన్ ప్రభుత్వం పై లోకేష్ ఇంకాస్త దూకుడుగా ముందుకెళ్తున్నారు. నేరుగా ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జలను టార్గెట్ చేస్తూ ఘాటైన విమర్శలు చేస్తున్నారు. తాజాగా మద్యం షాపులకు అక్రమ అనుమతులు ఇచ్చారు అంటూ చంద్రబాబు పై మోపిన కేసును ఉద్దేశించి జగన్ కు సవాల్ విసిరారు లోకేష్.

ADVERTISEMENT

జగన్ తెచ్చిన పిచ్చి ముందుకు 35 లక్షల మంది వివిధ రోగాల బారిన పడ్డారు, 30 వేల మంది అమాయక ప్రజలు ఈ ప్రభుత్వ మద్యం తాగి ప్రాణాలు విడిచారు.వీరందరూ ప్రభుత్వం మీద కేసులు పెడితే జగన్ మీద 35 లక్షల కేసులవుతాయి. మధ్య నిషేధం అంటూ ప్రజలకు దొంగ హామీలు ఇచ్చి ఒక్కో క్వార్టర్ తయారీకి 15 రూపాయలు ఖర్చు అయితే వాటిని 250 రూ. చప్పున్న ప్రజలకు విక్రయిస్తూ చేస్తుంది లూటీ కాకామరేమి? అంటూ జగన్ పై విరుచుకుపడ్డారు నారా లోకేష్.

లక్షల కోట్ల ప్రజా ధనాన్ని లూటీ చేస్తూ బాబు గారి పై జగన్ ప్రభుత్వం కేసులు పెట్టడం విడ్డురంగా ఉందన్నారు.మద్యం పాలసీ మీద రాష్ట్రంలో నువ్వు పెట్టిన ఏ లిక్కర్ షాప్ ముందైనా నేను చర్చకు సిద్ధం అంటూ లోకేష్, జగన్ కు “జే బ్రాండ్ ఛాలెంజ్” వదిలారు.ఎవరి హయాంలో లిక్కర్ దందా నడుస్తుందో తేల్చుకుందామా?నిన్ను మందు బాబులు తిడుతున్న తిట్లు వినే ధైర్యం ఉంటే డేట్ ఫిక్స్ చెయ్యి అంటూ జగన్ కు సవాల్ మీద సవాల్ విసురుతున్నారు.

“కక్ష్య సాధింపులో నువ్వు ప్రెసిడెంట్ మెడల్..,ఆంధ్రా గోల్డ్ బ్రదర్” అంటూ తన X మాధ్యమం లో జగన్ పై రెచ్చిపోయారు నారా లోకేష్. చంద్రబాబుకి బెయిలు వచ్చిన ఆనందంలో జగన్ పై ఇంకాస్త డోసు పెంచాడు లోకేష్..,నువ్వు తగ్గమాకు అన్నా అంటూ టీడీపీ శ్రేణులు ఈ ట్వీట్ ను షేర్ చేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.లోకేష్ జగన్ ప్రభుత్వం పై తనదైన విమర్శలతో ముందుకెళ్తూ టీడీపీ కార్యకర్తలలో జోష్ నింపుతున్నారు అనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదని చెప్పాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

AP Civic Polls: TDP Gets 11 Corporations, Jana Sena 4, BJP 2

The TDP, Jana Sena and BJP have finalised their seat-sharing agreement for Andhra Pradesh’s urban…

16 minutes ago

Illinois Anti-Hindu Plot: India Lauds Timely Action

The plot to commit a mass shooting at a Hindu temple in Aurora has been…

46 minutes ago