
ఈనెల 10వ తేదీ నుంచి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రజల మద్యకు రాబోతుంటే, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈనెల 17వ తేదీన విశాఖ జిల్లా భీమిలిలో యువగళం పాదయాత్ర ముగిస్తుండటం కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది.
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేయాలనుకొన్నప్పటికీ, చంద్రబాబు నాయుడు అరెస్ట్, కేసుల కారణంగా మద్యలో మూడు నెలలు గ్యాప్ రావడంతో పాదయాత్ర చాలా ఆలస్యమైంది. కనుక పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టేందుకు కాస్త ముందుగానే యువగళం పాదయాత్ర ముగించబోతున్నారు.
యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా ఆరోజు మధురవాడ పరిసర ప్రాంతాలలో టిడిపి ఓ భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. దానిలో చంద్రబాబు నాయుడుతో సహా రాష్ట్రంలో టిడిపి నేతలందరూ పాల్గొయబోతున్నారు. వారితో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఆయన పార్టీ ముఖ్యనేతలు కూడా పాల్గొనబోతున్నారు. ఒకవేళ బీజేపీ కూడా వాటితో కలిస్తే ఆ పార్టీ నేతలు కూడా ఈ సభలో పాల్గొనే అవకాశం ఉంటుంది.
ఇక ఈ నెల 8-9 తేదీలలో సిఎం జగన్ విశాఖలో ఋషికొండపై కట్టుకొన్న విలాసవంతమైన భవనంలోకి మకాం మార్చాల్సి ఉంది. ఒకవేళ జగన్ కుటుంబ సమేతంగా విశాఖకు మకాం మార్చిన్నట్లయితే, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా విశాఖలో దిగిపోతారు. విశాఖలో రాజధాని ఏర్పాటు చేయదమంటే మాట తప్పని, మడమ తిప్పని జగన్ విశాఖ వచ్చేయడమే అని వైసీపి సూత్రీకరించేసింది కనుక వైసీపి హడావుడి కూడా మామూలుగా ఉండదు. ఒకవేళ జగన్ మళ్ళీ కుంటిసాకులతో విశాఖకు రాకుండా వాయిదా వేసుకొన్నా ఆశ్చర్యం లేదు.
ఈ నేపధ్యంలో ఋషికొండపై సిఎం క్యాంప్ కార్యాలయానికి, ప్రభుత్వ శాఖలు కొలువు తీరబోయే మిలీనియం టవర్స్‌కు కూతవేటు దూరంలో డిసెంబర్ 17న టిడిపి, జనసేనలు కలిసి నిర్వహించబోయే సభ రాష్ట్ర రాజకీయాలపై పెను ప్రభావం చూపే అవకాశం ఉంది.
Janani Ashok Kumar gives classic polka dots a fresh, flirty update in this outdoor photoshoot.…
Ever since Lyca Productions dropped the official announcement on Indian 3, suggesting that the pending…