Telugu

నకిలీ డీఎస్సీకి ఒరిజినల్ డీఎస్సీతో నారా లోకేష్‌ జవాబు… భలే ఉందే!

టిడిపి యువనేత నారా లోకేష్‌ నేటి నుంచి శంఖారావం పాదయాత్ర ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోని సురంగి రాజా మైదానంలో ఏర్పాటు చేసిన సభతో దీనికి శ్రీకారం చుట్టారు. నేటి నుంచి 50 రోజుల పాటు ఉత్తరాంధ్రా జిల్లాలలోని అన్ని నియోజకవర్గాల గుండా నారా లోకేష్‌ పాదయాత్ర చేస్తారు.

ఇచ్చాపురం సభలో నారా లోకేష్‌ డీఎస్సీ గురించి చాలా ఆసక్తికరమైన మాట ఒకటి చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక మూడేళ్ళకో ఐదేళ్ళకో కాకుండా ఏటా టంచునుగా డీఎస్సీ విడుదల చేస్తూ, ఎప్పటికప్పుడు ఖాళీ అవుతున్న టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని నారా లోకేష్‌ ప్రకటించారు.

ADVERTISEMENT

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా జాబ్ క్యాలండర్ ప్రకటించింది. ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రాగానే జాబ్ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఉద్యోగాలు భర్తీ చేయాలనే చిత్తశుద్ధి ఉన్నవారు చేసే విధానం ఇది! నారా లోకేష్‌ అదే చెపుతున్నారు కనుక రేపు అదే చేస్తారని అర్దమవుతూనే ఉంది.

అయితే నారా లోకేష్‌ ఇప్పుడు డీఎస్సీ గురించి మళ్ళీ ఎందుకు మాట్లాడారంటే, మార్చి 12న జగన్‌ ప్రభుత్వం డీఎస్సీ జారీ చేస్తామని ప్రకటించి నిరుద్యోగులను మభ్య పెట్టాలని ప్రయత్నిస్తోందని గ్రహించినందునే.

ఒకవేళ జగన్‌ ప్రభుత్వానికి నిజంగానే డీఎస్సీ తీసి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయపోస్టులను భర్తీ చేయాలనుకుంటే అధికరంలోకి రాగానే ఒకటి రెండేళ్ళలోనే ఆ పని చేసి ఉండవచ్చు… తెలంగాణ రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంలాగ!

కానీ నేడో రేపో ఎన్నికల గంట మోగబోతుంటే, జగన్‌ ప్రభుత్వం డీఎస్సీ ప్రకటిస్తామని ఇంకా ఊరిస్తోంది. ఆ డీఎస్సీని అది అమలుచేయాలంటే ముందు ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రావాల్సి ఉంటుంది. కానీ ఏపీలో వైసీపికి ఎదురుగాలి వీస్తోంది. ఏపీలో మారుతున్న రాజకీయ పరిణామాలు, సమీకరణాలు, బలాబలాలు కూడా అదే సూచిస్తున్నాయి.

కనుక అధికారంలోకి వస్తుందో రాదో తెలీని పరిస్థితిలో ఉన్న వైసీపి ప్రభుత్వం విడుదల చేయబోయే డీఎస్సీ నోటిఫికేషన్‌ కేవలం నిరుద్యోగులను మభ్య పెట్టేందుకే తప్ప దాంతో ఎటువంటి ఉపయోగమూ ఉండకపోవచ్చు. ఎన్నికల గంట మోగితే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. కనుక వైసీపి ప్రభుత్వం డీఎస్సీ జారీ చేయలేకపోవచ్చు. ఈ విషయం వైసీపి ప్రభుత్వానికి తెలిసినా మార్చి 12న ముహూర్తం పెట్టిందంటే అర్దం చేసుకోవచ్చు. డీఎస్సీ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న నిరుద్యోగులను దీంతో వల వేసి పట్టుకోవచ్చని, దాని కోసమైనా వారు మళ్ళీ తమ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తారని వైసీపి దురాశపడుతోంది.

వైసీపి డీఈస్సీ వెనుక కధ ఇలా ఉంటే, నారా లోకేష్‌ అసలు డీఎస్సీ ఏవిదంగా ఉంటుందో ఇచ్చాపురం సభలో తేల్చి చెప్పేశారు. నకిలీ డీఎస్సీకి నారా లోకేష్‌ డీఎస్సీతోనే ఈవిదంగా జవాబు చెప్పడం భలే ఉంది కదా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Imran Khan Faces Exit Notice After Mumbai Protest

Actor Imran Khan is facing fresh controversy after taking part in a protest in Mumbai.…

29 minutes ago

Ram Charan Trusts Sukumar to Build RC17 His Way

Ram Charan is reportedly giving Sukumar complete freedom to shape their next collaboration, tentatively titled…

59 minutes ago