
అంతకు ముందు నారా లోకేష్ ప్రజలతో మాట్లాడుతుంటే పోలీసులు వచ్చి “మీకు పర్మిషన్ లేదు వెంటనే అక్కడి నుంచి బయలుదేరాలని” కోరారు. వారికి నారా లోకేష్ ఘాటుగా ఎదురు ప్రశ్నించారు. “ప్రజలతో మాట్లాడేందుకు నాకు మీ పర్మిషన్ ఎందుకు?అయినా నాకు ఎవరు పర్మిషన్ ఇస్తారు?ఎందుకు తీసుకోవాలి?మీరు ఏ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారు? ఏ రాజ్యాంగం ప్రకారం పర్మిషన్ తీసుకోవాలని నాకు చెపుతున్నారు?నన్ను అడ్డుకోమని మిమ్మల్ని ఎవరు పంపారు?వెళ్ళి వారికే చెప్పండి…. ప్రజలతో మాట్లాడేందుకు ఎవరి పర్మిషన్ అక్కరలేదని లోకేష్కి అంటున్నాడని.
ఇప్పటికే నామీద ఓ అరడజను కేసులు పెట్టారు. కనుక మరో కేసు పెట్టాలనుకొంటే పెట్టుకోండి. నా పాదయాత్రకి రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇలా సమస్యలు సృష్టిస్తున్నారు. ప్రశాంతంగా సాగుతున్న పాదయాత్రలో మీరే అలజడి సృష్టించి శాంతిభద్రతల సమస్యలని అడ్డుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు వైసీపీ నేతల కనుసన్నలలో పనిచేస్తూ నన్ను అడ్డుకోవాలని చూస్తే రేపు మేము అధికారంలోకి వచ్చినప్పుడు నీ పరిస్థితి ఏమిటో ఆలోచించుకొంటే మంచిది,” అంటూ నారా లోకేష్ ఘాటుగా ఎస్సైని హెచ్చరించారు.
Vijay Deverakonda is back on the big screen with Ranabaali. The film is based on…
Aakasamlo Oka Tara, presented by Geetha Arts and Swapna Cinema, explores the story of Kalpana,…