
పుష్కరాలు ఫెయిల్ కావాలని సాక్షి ప్రార్ధనలు చేస్తోందని… సాక్షిలో తప్ప మిగతా మీడియా ఛానల్స్ లో ఈ అద్భుతమైన కార్యక్రమం గురించి సరైన సమాచారం చూడవచ్చని… లోకేష్ వ్యంగ్యాస్త్రాలతో కూడిన ట్వీట్లు చేసారు. ప్రభుత్వం చేసేటటువంటి ఎలాంటి కార్యక్రమం పైన అయినా… వ్యతిరేక ప్రచారం చేయడం జగన్ మీడియాకు వెన్నతో పెట్టిన విద్య కావడంతోనే… లోకేష్ వ్యాఖ్యలను సమర్ధించే వారి సంఖ్య పెరుగుతోంది.
పుష్కరాల వంటి ఒక పెద్ద కార్యక్రమం తలపెట్టినపుడు అక్కడక్కడ చిన్న చిన్న లోటుపాటులు కనపడుతూనే ఉంటాయి. అయితే వీటిని హైలైట్ చేస్తూ… అసలు కార్యక్రమాన్నే తప్పు పట్టే విధంగా ప్రసారాలు చేయడం తగదన్న భావన అన్ని వర్గాల నుండి వ్యక్తమవుతోంది. ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమం కంటే కూడా… కోట్లాది భక్తులు నమ్మకంతో కొలిచే పవిత్ర కార్యక్రమంగా భావిస్తే… తప్పుడు కధనాలకు చోటు ఉండదన్న హితకరమైన మాటలు జగన్ మీడియాకు చెబుతున్నారు.
The motion poster of Chandrayan has been unveiled, giving audiences a glimpse into a wildly…
Chennai Super Kings have been asked to consider a change in captaincy before IPL 2027,…