Telugu

డేటా సెంటర్ల నీటి వాడకంపై దుష్ప్రచారం దేనికి?

ప్రతీ నూతన ఆవిష్కరణ ఎంత అద్భుతంగా ఉంటుందో, దాని పట్ల అంతగాను ప్రజలలో అనుమానాలు, అపోహలు, భయాలు కూడా నెలకొంటాయి. కంప్యూటర్లు వచ్చిన కొత్తలో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతారనే ఆందోళన ఉండేది. కానీ వాటితోనే లక్షలాది మంది జీవితాలు మలుపు తిరిగాయి. కంప్యూటర్లతోనే యావత్ ప్రపంచం నడుస్తోందిప్పుడు.

అలాగే ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్) వచ్చినప్పుడు ఇలాంటి భయాందోళనలే వ్యక్తం అయ్యాయి. కానీ ఇప్పుడు చాలా మంది తెలిసో తెలియకుండానో ఏఐ ప్రయోజనాలు పొందుతున్నారు. తెలిసిన వారు విరివిగా వాడుకుంటున్నారు కూడా.

ADVERTISEMENT

విశాఖలో గూగుల్ డాటా సెంటర్స్ ఏర్పాటవుతున్నప్పుడు, ఎప్పటిలాగే వైసీపీ మొదట దానిపై దుష్ప్రచారం చేసింది. వాటి కూలింగ్ సిస్టం నిర్వహణ కొరకు భారీగా నీళ్ళు అవసరం పడతాయని, కనుక విశాఖ నగర ప్రజలకు తాగునీటి కొరత ఏర్పడాబోతోందంటూ దుష్ప్రచారం చేసింది.

మళ్ళీ అదే నోటితో ‘గతంలో మేము చేసిన కృషి వల్లనే గూగుల్‌ విశాఖకి వచ్చింది. కానీ సిఎం చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీ చేశారని’ ఆరోపించింది.

అయితే డేటా సెంటర్ల నీటి వినియోగంపై జనసేన ఎమ్మెల్యే నాగమాధవి నేడు శాసనసభలో అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్‌ చెప్పిన సమాధానం, వైసీపీ దుష్ప్రచారానికి చెక్ పెడుతున్నట్లే ఉంది.

“విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు వినియోగించుకునే నీటితో పోలిస్తే డేటా సెంటర్ల కూలింగ్ వ్యవస్థకు పదో వంతు నీరు సరిపోతుంది. డేటా సెంటర్స్ నీటి వినియోగం గురించి వితండవాదం చేస్తున్నవారు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నీటి వినియోగం గురించి మాట్లాడారు. ఎందుకు?

డేటా సెంటర్లలో 6.53 గిగావాట్స్ సామర్ధ్యంతో పని చేస్తున్నప్పుడు వాటి కూలింగ్ వ్యవస్థలకు 3 టీఎంసిల నీళ్ళు అవసరం పడతాయని అంచనా. ప్రస్తుతం సుమారు 3,000 టీఎంసిల నీళ్ళు సముద్రంలో కలుస్తున్నాయి. అంటే వాటిలో వెయ్యో వంతు నీరు మాత్రమే ఉపయోగించుకుంటున్నాము.

నాడు కంప్యూటర్లని వద్దనుకుంటే ఇంత అభివృద్ధి జరిగేదా?అదేవిధంగా ఇప్పుడు అభివృద్ధికి అత్యంత కీలకమైన డేటా సెంటర్లను అడ్డుకుంటే నష్టపోతాము. డేటా సెంటర్లకు నీటిని పోలవరం నుంచి ప్రత్యేక పైప్ లైన్ ద్వారా సరఫరా చేస్తాము తప్ప విశాఖ నగర ప్రజల తాగునీటి నుంచి కాదు. అలాగే విశాఖ నగరానికి పోలవరం నుంచి గ్రావిటీ పద్దతిలో నీటిని సరఫరా చేస్తాము,” అని మంత్రి నారా లోకేష్‌ చెప్పారు.

ప్రతీ ఊర్లో కనిపించే బైక్, కార్ వాష్ సెంటర్లు మొదలు గ్రానైట్, ఆక్వా, డైరీ, మందులు తదితర పరిశ్రమల వరకు, ప్రతీ చోట భారీగానే నీటి వాడకం జరుగుతుంటుంది. వాటి గురించి వైసీపీతో సహా ఎవరూ ఏనాడూ ప్రశ్నించింది లేదు. కానీ గూగుల్ డేటా సెంటర్స్ నీటి వాడకంపైనే దుష్ప్రచారం జరుగుతోంది. ఎందువల్ల?అంటే కారణం అందరికీ తెలుసు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

నాని చేసిన తప్పే విజయ్ కూడా చేస్తున్నాడా?

ప్యారడైజ్ సినిమా ప్రమోషన్స్ టైంలో పాన్ ఇండియా అనే పదాన్ని ఎక్కువగా ఎబ్యూజ్ చేస్తున్నామని చెప్పి మరీ.. తెలుగులో తప్ప…

2 hours ago

Rashmika Dragged Again: Kannada Cinema Targeting Her?

Kannada cinema is increasingly proving that films made on modest budgets can find audiences beyond…

3 hours ago