Telugu

ఇప్పుడు టీడీపీ కి కావాల్సింది ఇది కాదేమో!

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్తుతో డీలా పడ్డ తెలుదేశం శ్రేణులు రోడ్ల మీద నిరసన దీక్షలు, కాలినడకన దేవాలయాల సందర్శనం, మోన దీక్షలు అంటూ చేస్తున్న కార్యక్రమాలు ఏవి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుకూడా లేవనే చెప్పాలి. అయితే కార్యకర్తలు నుండి అటువంటి స్పందన హర్చించదగినదే కానీ టీడీపీ అధినాయకత్వం నుండి వచ్చే కార్యక్రమాలు కూడా ఇదేతరహాలో ఉండడమే టీడీపీకి బలహీనతగా మారే ప్రమాదముంది అని గ్రహించాలి.

గాంధీ జయంతి రోజున చంద్రబాబు సతీమణి నిర్వహించిన నిరాహార దీక్ష కానీ దానికి మద్దతుగా ఢిల్లీలో లోకేష్ దీక్ష కానీ, అదేవిధంగా రాష్ట్రమంతా జరిగిన దీక్షలు కానీ ప్రభుత్వంలో ఏమాత్రం చలనం తెప్పించలేక పోయింది.మోత మోగిద్దాం వంటి కార్యక్రమాల ఫలితంగా టీడీపీ కి ఒరిగిందేమీలేదనే చెప్పాలి. ఇప్పుడు కాంతిలో క్రాంతి అంటూ లోకేష్ ఇచ్చిన నిరసన కార్యక్రమం కూడా ఇటువంటి ఫలితాన్నే ఇస్తుందని చెప్పవచ్చు.

ADVERTISEMENT

ప్రజలలో చంద్రబాబు అరెస్ట్ పట్ల చర్చ జరగడానికి, ప్రజలలో బాబుకి ఉన్న మద్దత్తు తెలుసుకోవడానికే ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగ పడతాయి కానీ ప్రభుత్వాన్ని కదిలించలేం అనేది టీడీపీ అధినాయకత్వం గుర్తించాలి. ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూనే ప్రజలలోకి దూసుకెళ్లే వ్యూహాలతో ముందుకెళ్తేనే ప్రభుత్వం వెనుకడుగు వేయగలదు.

రాష్ట్ర విభజన సమయంలోను, ప్రత్యేక హోదా విషయంలోనూ రాష్ట్రంలో ఇటువంటి నిరసనలు దీక్షలు కొనసాగాయి. వాటి ఫలితం రాష్ట్ర ప్రజలు ఇప్పటికి అనుభవిస్తున్నారు కూడా. నిరసన తాలూకా వచ్చే సెగ ప్రభుత్వాన్ని కదిలించేదిగా ఉండాలి అప్పుడే ప్రభుత్వాలు ఆలోచనలో పడతాయి. ఢిల్లీ నుంచి వచ్చిన లోకేష్ ప్రజా క్షేత్రంలోకి వెళ్లి అక్కడ తన వానిని ప్రభుత్వ తీరుని వినిపించాలి.

పొత్తులో భాగంగా ఇప్పుడు తెలుగు తమ్ముళ్లకు తోడు జనసైనికులు కూడా లోకేష్ వెంట నిలబడే అవకాశం లేకపోలేదు. ఒక్కటే గొంతు రెండు పార్టీల కార్యకర్తల బలంగా పవన్ తన వారాహి యాత్రను కొనసాగిస్తున్నట్లే లోకేష్ కూడా ప్రభుత్వ దమనకాండను, బాబు పట్ల జగన్ వైఖరిని ప్రజల ముందు ఉంచితేనే టీడీపీ శ్రేణులలో నూతన ఉత్సహాన్ని తీసుకురాగలుగుతారు.

చంద్రబాబు అరెస్టుతో ఇప్పటికే రాజకీయాలలో రాటు తేలిన లోకేష్ కి ఇది పెద్ద కష్టమేమి కాకపోవచ్చు. హస్తిన సాక్షిగా ఇప్పటికే తన వాక్ చాతుర్యాన్ని రాష్ట్ర ప్రజలకు, ప్రభుత్వానికి చూపించిన లోకేష్ తన బలంతోనే ప్రత్యర్థులను బలహీన పరచాలి. ఒక పక్క తండ్రిని నిర్దోషిగా బయటకు తీసుకువచ్చే కార్యక్రమాలు చేస్తూ, అలాగే ప్రభుత్వం తనపై మోపే తప్పుడు కేసులను ఎదుర్కొంటు అటు పార్టీని ఇటు పార్టీ నేతలను సమన్వయ పరుచుకుంటూ ప్రభుత్వం పై ఒత్తిడి పెంచగలిగితే రాజకీయాలలో లోకేష్ తనదైన ముద్రను వేయగలుగుతారు.

ఇప్పుడున్న పరిస్థితులలో ఒత్తిడులను తట్టుకుంటూ రానున్న రోజులలో పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో లోకేష్ పాత్రే కీలకం. ప్రజా పోరాటాలతోనే ఏదైనా సాధించగలం అనేది ఎన్నో సందర్భాలలో రుజువయ్యింది. ఇప్పుడు టీడీపీ కి కావాల్సింది కూడా ఇదే అనుకుంటా! పోరాడితే ప్రభుత్వం కేసులతో వాటిని ఆపే ప్రయత్నం చేస్తుంది, కానీ ప్రభుత్వాలు ఎంతమంది మీద కేసులు పెట్టి జైలుకు పంపించగలరు.ప్రజాస్వామ్యంలో
ఇది సాధ్యమేనా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Ranabaali Review: USA Premiere Report

Ranabaali Review: History Without Heart A film rooted in heart-wrenching stories is let down by…

4 hours ago

Jailer 2 Day 1 BO: Great Start, But Missed Potential?

Rajinikanth's Jailer 2 has taken a strong start at the global box office and is…

7 hours ago