
టిడిపి యువనేత నారా లోకేష్ బుధవారం సాయంత్రం తను పోటీ చేయబోతున్న మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తనకూ, గత ఎన్నికలలో తనను ఓడించిన ఆళ్ళ రామకృష్ణా రెడ్డికి గల కొన్ని తేడాలను వివరించి ప్రజలను ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన వైసీపి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ఓ మంచి నటుడని పొగుడుతూ ఆయనను ఉద్దేశ్యించి ‘కరకట్ట కమల్ హాసన్’ అని అభివర్ణిస్తూ కొన్ని సూటి ప్రశ్నలు అడిగారు.
“ఎవరైనా ఎన్నికలలో ఓడిపోతే మళ్ళీ ఎన్నికల వరకు నియోజకవర్గం ప్రజలకు కనబడకుండా మాయం అయిపోతారు. గత ఎన్నికలలో మీరు నన్ను కాదనుకొని ఆళ్ళ రామకృష్ణా రెడ్డిని గెలిపించారు. కానీ ఓడిపోయిన నేను మీ నియోజకవర్గంలోనే తిరుగుతుంటే, గెలిచిన ‘కరకట్ట కమల్ హాసన్’ ఈ 5 ఏళ్ళలో ఎన్నిసార్లు మీ నియోజకవర్గానికి వచ్చారో మీకే బాగా తెలుసు.
నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తానని హామీలు ఇచ్చిన నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తానని హామీలు ఇచ్చిన ఆయన ఏం చెప్పారు? ఏం చేశారు?నియోజకవర్గం అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి నిధులు ఇవ్వడం లేదని, తనకు టికెట్ ఇవ్వకుండా మోసం చేశారని స్వయంగా చెప్పారా లేదా తల్లీ?
ఆ తర్వాత షర్మిలమ్మ వెంట నడుస్తా అంటూ పార్టీకి రాజీనామా చేశారు. కానీ రెండు నెలలు తిరిగేసరికి మళ్ళీ తాడేపల్లి ప్యాలస్లో వైసీపి కండువా కప్పుకొన్నారు?జగన్ ప్రజలని, తనను కూడా మోసం చేశారని ఆరోపించినప్పుడు మళ్ళీ వైసీపిలో ఎందుకు చేరిన్నట్లు? రెండు నెలల్లో ఏం జరిగిపోయింది?మళ్ళీ వైసీపిలో ఎందుకు చేరాల్సి వచ్చింది? ఆయనే చెప్పాలి.
మళ్ళీ వైసీపిలో చేరారు కనుక రేపు మీరు పొలాలలో పనిచేసుకుంటే ఆయన కూడా క్యారేజీ పట్టుకొని మీ దగ్గరకు వచ్చి కొత్త డ్రామా మొదలుపెడతారు. అప్పుడు మీరే ఆయనను ఈ ప్రశ్నలడగండి.
నేను ఎన్నికలలో ఓడిపోయినా నియోజకవర్గాన్ని ఎన్నడూ విడిచిపెట్టలేదు. నియోజకవర్గంలో చాలా మందికి కుట్టు మిషన్లు, తోపుడు బళ్ళు వగైరా ఇచ్చి స్వయం ఉపాధి కల్పించాను. రోగులకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయించి వైద్య చికిత్సలు, మందులు ఇప్పించాను. సుమారు 70 కుటుంబాలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాను.
ఇవన్నీ నేను ప్రతిపక్షంలో ఉండగా చేసిన పనులు. అదే ఈసారి నన్ను భారీ మెజార్టీతో గెలిపించి శాసనసభకు పంపిస్తే, నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని అన్ని విదాలా అభివృద్ధి చేసి చూపిస్తాను. నేను ఎన్నికల కోసం ఈ మాటలు చెప్పడం లేదు. నేను ఏం చేయగలనో అదే చెప్పాను. చేసి చూపించాను కూడా. చేయలేకపోతే చేయలేనని చెప్పి దణ్ణం పెట్టి చెపుతాను తప్ప ‘కరకట్ట కమల్ హాసన్’లా డ్రామాలు ఆడను. ఏదేదో చేసేస్తానని మిమ్మల్ని మభ్యపెట్టను,” అని నారా లోకేష్ అన్నారు.
నారా లోకేష్కు రాజకీయాలలో ప్రాధమిక అర్హత కూడా లేదని సర్టిఫై చేసిన మంత్రి అంబటి రాంబాబు కూడా ఓసారి ఈ వీడియోని చూస్తే బాగుంటుంది.
Andhra Pradesh’s local body elections are becoming an important test for the relationship between Chandrababu…
Yash’s look as Ravana in Nitesh Tiwari’s Ramayana has sparked another debate, with Aarya Babbar…