Telugu

లోకేష్ కొత్త ఆలోచన.. రానా గ్రీన్ సిగ్నల్‌!

ఐటి తదితర రంగాల్లో ఉద్యోగులు ఎంత అనుభవం ఉన్నా ఎప్పటికప్పుడు అందివచ్చే సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించడం చాలా అవసరం. లేకుంటే ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి నెలకొంది.

ఇదేవిధంగా ఇప్పుడు పాలకులు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకుంటే సరిపోదు. వారు కూడా ఎప్పటికప్పుడు అందివచ్చే సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకొని ఉపయోగించుకోవడం చాలా అవసరం.

ADVERTISEMENT

అలాగే ఆలోచనా విధానంలో కూడా మార్పు తప్పనిసరి. అప్పుడే రాష్ట్రంలో ఉన్న సహజ, మనవ వనరులు, వాటితో అవకాశాలను సృష్టించుకోగలుగుతారు.

ఇందుకు ఓ చిన్న ఉదాహరణగా విశాఖ సీఐఐ సదస్సులో మంత్రి నారా లోకేష్‌ చేసిన ఓ కొత్త ప్రతిపాదన ‘క్రియేటర్ ఎకానమీ’ గురించి చెప్పుకోవచ్చు.

సినీ పరిశ్రమ ఏపీకి తరలి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కానీ దానిలో పుష్కలంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్నాయి. అలాగే సినీ పరిశ్రమలో వివిధ విభాగాలలో ప్రవేశించాలని కోరుకుంటున్న యువత ఆంధ్రాలో చాలా మందే ఉన్నారు.

ఆర్ధిక స్తోమతు, కాస్త అదృష్టం ఉన్నవారు ఏదోవిధంగా సినీ పరిశ్రమలోకి ప్రవేశించ గలుగుతున్నారు. మరికొంత మంది సొంతంగా షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ, యూట్యూబ్‌ ఛానల్స్ ద్వారా గుర్తింపు సంపాదించుకుంటున్నారు. ఇంకొందరు టీవీ కార్యక్రమాలలో అవకాశాలు దక్కితే వాటిలో తమ ప్రతిభతో గుర్తింపు సంపాదించుకుంటున్నారు.

కానీ ఇంకా వేలాది మంది హైదరాబాద్‌లో సినీ ప్రముఖులు, సినీ సంస్థల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈరోజుల్లో కూడా ఇంకా ఇలాంటి పరిస్థితులు నెలకొని ఉండటం బహుశః మంత్రి నారా లోకేష్‌ను ఆలోచింపజేసి ఉండవచ్చు. అందుకే ఆయన ‘క్రియేటర్ ఎకానమీ’ ప్రతిపాదన చేశారు.

సినీ పరిశ్రమలో నటన, సంగీతం, ఆర్ట్ డైరెక్టర్, సినిమాటోగ్రఫర్స్ , కోరియోగ్రఫర్స్, స్టంట్ మాస్టర్స్, ఎడిటింగ్, యానిమేషన్, గేమింగ్, వీఎఫ్ఎక్స్ వంటి వివిధ విభాగాలకు అత్యంత నైపుణ్యం కలిగిన వారు చాలా అవసరం.

కనుక వీటన్నిటికీ కలిపి విశాఖలో ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ’ పేరుతో ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలని, ప్రముఖ నటుడు, నిర్మాత దగ్గుబాటి రానాకు విజ్ఞప్తి చేశారు.

తద్వారా సినీ పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలు కలిగిన యువత లభించడమే కాకుండా ఈ రంగంలో ప్రవేశించాలనుకుంటున్న యువతకు మేలు కలుగుతుంది. ఇది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు సృష్టిస్తుంది కనుక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు చాలా ఉపయోగపడుతుంది.

మంత్రి నారా లోకేష్‌ చేసిన ఈ ప్రతిపాదనకు రానా దగ్గుబాటి వెంటనే సానుకూలంగా స్పందించారు. వచ్చే సోమవారం లోగా ఈ ప్రాజెక్టుకు బ్లూప్రింట్ సిద్ధం చేయిస్తానని, ఏడాదిలోగా విశాఖలో ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ’ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

పాలకులు మూస పద్దతులలో కాకుండా వినూత్నంగా ఆలోచించడం ఎంత అవసరమో గ్రహించేందుకు ఇదొక చిన్న ఉదాహరణ.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Chiranjeevi’s Megaverse Moves Closer to OTT Debut

Chiranjeevi's OTT debut Megaverse is reportedly getting closer to its premiere. The talk show, which…

9 minutes ago

From X Posts to FIR: Kangana Faces Legal Trouble

Actress and BJP MP Kangana Ranaut has landed in legal trouble over her social media…

23 minutes ago