
విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని తన సోదరుడు కేశినేని శివనాధ్ (చిన్ని)కి మద్య చాలా ఏళ్ళగా విరోధం ఉంది. కనుక తమ్ముడు ఫోటోతో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టి ఆయన, తన స్నేహితుడు అబ్బూరి సతీష్ కలిసి కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి విశాఖలో డేటా కంపెనీ పెడతామని కారు చావుకగా 56.36 ఎకరాలు కొట్టేశారని కేశినేని నాని ఆరోపించారు.
ఆయన ఆరోపణలకు మంత్రి నారా లోకేష్ స్వయంగా సోషల్ మీడియా ద్వారానే జవాబు ఇచ్చారు. అసలు ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీతో కేశినేని చిన్నికి ఎటువంటి సంబంధమూ లేదని, అదో అమెరికాకు చెందిన కంపెనీ అని నారా లోకేష్ తెలియజేశారు. ఆ కంపెనీకి మధురవాడలో ఎకరం కోటి రూపాయలు చొప్పున, కాపుల ఉప్పాడలో ఎకరం రూ.50 లక్షలు చొప్పున ఇచ్చామే తప్ప అప్పనంగా ఇవ్వలేదని నారా లోకేష్ స్పష్టం చేశారు. ఒకవేళ ఆ భూములలో కంపెనీ ఏర్పాట్లు చేసి ఎకరానికి కనీసం 500 మందికి ఉద్యోగాలు కల్పించకపోయినా, ఆ భూమిని వేరే వారికి బదిలీ చేయాలని ప్రయత్నించినా ఆటోమెటిక్ భూకేటాయింపు రద్దు అయిపోతుందని, పైగా నష్ట పరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుందని ఒప్పందంలోనే చాలా స్పష్టంగా పేర్కొన్నామని మంత్రి నారా లోకేష్ తెలపారు.
కనుక కేశినేని నాని సోదరుడుపై ద్వేషంతో అవాస్తవాలతో ఆరోపణలు చేసిన్నట్లు అర్దమవుతోంది. కానీ ఇటువంటి ఆరోపణలు చేయడం వలన కూటమి ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందని ప్రజలలో అనుమానాలు మొదలవుతాయి. కనుక మంత్రి నారా లోకేష్ వెంటనే వాస్తవాలు వివరిస్తూ కేశినేని నానికి సోషల్ మీడియా ద్వారానే సమాధానం ఇవ్వడం చాలా మంచిదే.. అవసరమే.
మంత్రి నారా లోకేష్ ఏమన్నారో ఆయన మాటల్లోనే..
Tollywood’s December release race is getting more interesting, with Nithiin’s Alias Rukmini joining the December…
Vijay’s son Jason Sanjay chose to make his entry into films as a director rather…