చంద్రబాబు సూపర్ సిక్స్… లోకేష్‌ సూపర్ హిట్

ఇటీవల నేపాల్లో రాజకీయ సంక్షోభం ఏర్పడి రాజధాని ఖాట్మండులో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించినప్పుడు ఆంధ్రా నుండి నేపాల్ పర్యటనకు వెళ్ళిన అనేకమంది అక్కడ చిక్కుకుపోయారు. ఆ సమయంలో ఆందోళనకారులు వారి దేశ ఆర్ధికమంత్రినే రోడ్డుపైకి ఈడ్చుకువచ్చి చితకబాదారు.

భారతీయులు కనిపిస్తే పర్యాటకులని కూడా చూడకుండా వెంటపడి తరిమికొట్టారు. పర్యాటకుల డబ్బు, బంగారు ఆభరణాలు, సెల్ ఫోనులు లాక్కున్నారు.

ADVERTISEMENT

వారు బస చేసిన హోటల్స్‌కు నిప్పు పెట్టడంతో బట్టలు కూడా కాలిపోయాయి. వారిలో కొందరు వెంటనే మంత్రి నారా లోకేష్‌కు ఫోన్‌లో చేసి తమ పరిస్థితిని వివరించి కన్నీళ్ళు పెట్టుకున్నారు. తమని కాపాడవలసిందిగా కోరారు.

సరిగ్గా అదేరోజు కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ బహిరంగ సభ అనంతపురంలో జరుగుతోంది. కానీ నారా లోకేష్‌ దానికి వెళ్ళకుండా తన కార్యాలయంలో కూర్చొని బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. అప్పటికప్పుడు వారి కోసం ప్రత్యేక విమానం పంపించారు. దానిలో వారు ఖాట్మండూ నుంచి నేరుగా విశాఖపట్నం చేరుకున్నారు.

చేతిలో ఒక్క రూపాయి లేకుండా, కనీసం వేసుకునేందుకు మరో జత బట్టలు కూడా లేని అటువంటి క్లిష్ట పరిస్థితిలో తాము తిరిగి ఇళ్ళకు చేరుకోగలమని అనుకోలేదని కానీ మంత్రి నారా లోకేష్‌ దేవుడిలా ఆదుకున్నారని విశాఖ చేరుకున్న బాధితులు తెలిపారు.

ప్రజల పట్ల ఇంత నిబద్దత ఉంటుందనే నమ్మకంతో టీడీపికి ఓట్లు వేశామని, నారా లోకేష్‌ తన నిబద్దతని నిరూపించుకొని తమ మనసులు గెలుచుకున్నారని చెప్పారు.

‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ బహిరంగ సభలో పాల్గొనడం చాలా అవసరం కనుక మంత్రి నారా లోకేష్‌ ఈ బాధ్యతని వేరే మంత్రులకో, అధికారులకో అప్పగించి తాను సభకు వెళ్ళిపోవచ్చు. కానీ తానే స్వయంగా పూనుకొని అప్పటికప్పుడు ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి ఖాట్మండు నుంచి వారిని సురక్షితంగా రాష్ట్రానికి తిరిగి తీసుకు వచ్చారు.

ఇదివరకు ఇటువంటి సందర్భాలలో సిఎం చంద్రబాబు నాయుడు స్వయంగా చొరవ తీసుకునేవారు. ఇప్పుడు మంత్రి నారా లోకేష్‌ తండ్రి బాటలోనే నడుస్తూ ఈవిదంగా ప్రజల మన్ననలు పొందుతున్నారు. తండ్రి సూపర్ సిక్స్ అంటే కొడుకు సూపర్ హిట్ అంటున్నారు ప్రజలు!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Batwara 1947: Aamir Chooses Iconic Date for Sunny Deol

Batwara 1947 has received a major update as the makers prepare to release the teaser…

12 minutes ago

Peddi Dodging IPL Bullet Luckily?

Ram Charan is going to arrive on the big screens in exactly a week from…

32 minutes ago